Venkateswarlu
మంచు విష్ణు హీరోగా ప్యాన్ ఇండియా లెవెల్‌లో ‘‘కన్నప్ప’’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
మంచు విష్ణు హీరోగా ప్యాన్ ఇండియా లెవెల్‌లో ‘‘కన్నప్ప’’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Venkateswarlu
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’. పరమ శివభక్తుడు భక్త కన్నప్ప కథతో ఈ మూవీ ఉండనుంది. ‘మహా భారతం’ సీరియల్‌ను తీసిన ముఖేస్ కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్‌లు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా సినిమా టీం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.
కన్నప్ప చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం న్యూజిలాండ్‌లో జరిగింది. మొత్తం 600 మంది దాకా సిబ్బందితో కన్నప్ప యూనిట్ న్యూజిలాండ్‌కు వెళ్లింది. అక్కడి అడవుల్లో.. అందమైన ప్రదేశాల్లో చిత్ర షూటింగ్ చేశారు. కొద్దిరోజుల క్రితమే న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తయింది. ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ను మంచు మోహన్ బాబు తన సోషల్ మీడియాకు అందించారు. ‘‘ మొదటి షెడ్యూల్ కోసం 90 రోజులు వెచ్చించాము. న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది.
ఇక, అసలు విషయానికి వస్తే.. కన్నప్ప సినిమాతో మరో తరం మంచు వారసుడు చిత్ర పరిశ్రము పరిచయం కానున్నాడు. మంచు విష్ణు-విరానికా రెడ్డిల కుమారుడు అవ్‌రామ్ మంచు సినిమాల్లోకి రానున్నారు. కన్నప్ప మూవీలో కీలక పాత్రలు చేయనున్నారు. ఐదేళ్ల అవ్‌రామ్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అవ్‌రామ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు లక్షకు పైగా మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఈ ఖాతాలో అవ్‌రామ్‌కు సంబంధించిన అప్‌డేట్లు వస్తూ ఉంటాయి.
‘‘కన్నప్ప సినిమాటిక్ యూనివర్స్‌లోకి అవ్‌రామ్ మంచు అడుగుపెట్టబోతున్నాడు. మంచు ఫ్యామిలీనుంచి మరో అద్భుతమైన చాప్టర్ మొదలవ్వబోతోంది’’ అని ఇన్‌స్టాలో ఉంది. కాగా, పరుచూరి గోపాలక్రిష్ణ, నాగేశ్వర రెడ్డిలు కథను అందించారు. స్టీఫెన్ దేవాసీ, మణిశర్మలు సంగీతం అందిస్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలతో సినిమా తెరకెక్కుతోంది. 2024 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మంచు ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి, మంచు వారసుడు అవ్‌రామ్ మూవీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.