Venkateswarlu
జనవరి 11వ తేదీ సాయంత్రం హనుమాన్ సినిమా స్పెషల్ షోలు పడనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
జనవరి 11వ తేదీ సాయంత్రం హనుమాన్ సినిమా స్పెషల్ షోలు పడనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Venkateswarlu
హనుమాన్ సినిమా కోసం భారత దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవ్వనుంది. ఇప్పటికే బుక్ మై షోలో హనుమాన్ ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక, హనుమాన్ మూవీకి సంబంధించి జనవరి 11వ తేదీన స్పెషల్ షో ఉంది. సాయంత్రం 6.15, 6.30 గంటలకు షో పడనుంది.
ఈ స్పెషల్ షోకు సంబంధించి కూడా టికెట్లు మొత్తం అయిపోయాయి. థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారు. దీంతో టికెట్లు దొరకని ఫ్యాన్స్ ఆవేదనకు గురవుతూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ బాధను వెల్లగక్కుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో.. హనుమాన్ సినిమాకు వస్తున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు మరో షో వేయటానికి ప్లాన్ చేస్తున్నారు. 11వ తేదీ రాత్రి 9.30 గంటలకు స్పెషల్ షో పడనుంది.
ఈ షోకైనా టికెట్లు దక్కించుకోవాలని హనుమాన్ ఫ్యాన్స్ చూస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో స్పెషల్ షోలు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా, 12వ తేదీ హనుమాన్‌తో పాటు గుంటూరు కారం సినిమా కూడా విడుదల అవ్వనుంది. దీంతో హనుమాన్‌కు థియేటర్లు దొరకటం కష్టంగా మారింది. తక్కువ థియేటర్లే దొరికాయి. 12వ తేదీన థియేటర్లు దొరకవు కాబట్టి.. 11వ తేదీ సినిమాకు ఎక్కువ షోలు వేయటం లాభ సాటిగా మారనుంది.
కాగా, గత కొంతకాలం నుంచి థియేటర్ల విషయంలో గుంటూరు కారం, హనుమాన్ సినిమాలకు మధ్య పోటీ నడుస్తోంది. అయితే, గుంటూరు కారం స్టార్ హీరో సినిమా అయినా.. హనుమాన్ విషయంలో పోటీ పడలేకపోతోంది. కొన్ని విషయాల్లో హనుమాన్ ఓ మెట్టు పైనే ఉంటోంది. సినిమా టీం హనుమాన్ దేశ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక, ఈ చిత్రంలో చిరంజీవి ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. మరి, హనుమాన్ సినిమా టికెట్ల విషయంలో రికార్డులు సృష్టించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Hanuman: Since all the 6:15 PM/6:30 PM shows are sold out, Theatres Now started adding 2nd shows (09:30 PM) on Jan 11th
There is a huge demand for premier tickets. If the team extends this to second-tier centers, it would help to compensate the scarcity of theaters on Jan 12th pic.twitter.com/YhtJIBKNzZ
— Daily Culture (@DailyCultureYT) January 9, 2024