Venkateswarlu
Venkateswarlu
అన్న విజయ్ దేవరకొండ బాటలోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు తమ్ముడు ఆనంద్ దేవరకొండ. 2019లో వచ్చిన ‘దొరసాని’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘బేబీ’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌కు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ నేపథ్యంలోనే సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. కొంతమంది నెటిజన్లు హీరోయిన్ పాత్రపై సెటైర్లు వేస్తున్నారు. ఓ నెటిజన్ హీరోయిన్ రంగుపై కామెంట్ చేశాడు. ‘‘ వివాదాల కారణంగా ఫెయిర్ అండ్ లౌలీ.. గ్లో అండ్ లౌలీగా పేరు మార్చుకుంది. కానీ, ఇప్పటికీ కూడా బేబీ లాంటి సినిమాలో.. 2023లో రంగు మార్పు గురించి చూపిస్తున్నారు. యూట్యూబ్ షార్ట్‌ను సినిమాగా తీసినపుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి’’ అని పేర్కొన్నాడు. ఇక, ఈ కామెంట్ చిత్ర హీరో ఆనంద్ దేవరకొండ దృష్టికి వెళ్లింది.
ఆ కామెంట్‌పై ఆయన స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ నువ్వు ఏదైనా మాట్లాడేకంటే ముందు సినిమా చూడు.. తర్వాత కామెంట్ పెట్టు.. ఇది పబ్లిసిటీ స్టంట్.. అది అనవసరం’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, ఆనంద్ దేవర కొండ ప్రస్తుతం ‘గమ్ గమ్ గణేషా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మరి, నెటిజన్‌పై ఆనంద్ దేవరకొండ మండిపడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hot take, but mostly an unnecessary / woke take.
Maybe you can watch the movie and then comment before jumping the gun. https://t.co/qfk5JGZCok
— Anand Deverakonda (@ananddeverkonda) July 7, 2023