ఇండస్ట్రీలో కొంతమంది ముద్దుగుమ్మలు వచ్చిరాగానే ఫుల్ గ్లామర్ షోతో.. ఉన్న కొద్దిరోజులు ఊపేసి వెళ్లిపోతున్నారు. హీరోయిన్స్ లో ఇప్పుడున్న పోటీ సంగతి తెలిసిందే. ఒక ఛాన్స్ మిస్ చేసుకుంటే ఇంకో అవకాశం రావడానికి చాలా టైమ్ పడుతుంది. ఆల్రెడీ రొమాంటిక్ సీన్స్ కి.. గ్లామర్ షోకి ముందునుండి రెడీగా ఉంటే అవకాశం ఎటు నుండైనా రావచ్చు. కానీ.. ఖచ్చితంగా రొమాన్స్ కి, కిస్ సీన్స్ కి నో అంటే.. ఈరోజుల్లో అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అయితే.. కొంతమంది ఆ దారిలో వెళ్లి అవకాశాలు పొందుతుంటే.. ఇంకొందరు మాత్రం మంచి సినిమాలు, క్యారెక్టర్స్ వచ్చినప్పుడే చేస్తామని కూర్చుంటారు.
రీసెంట్ గా గదర్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్.. రొమాన్స్ కి ససేమిరా అంటోందట. కెరీర్ ఆరంభంలో బద్రి, నాని, నరసింహుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కి పరిమితం అయ్యింది. అప్పట్లో రొమాంటిక్ మూవీస్ తో పాటు సన్నివేశాలు సైతం చేసింది. అందుకే గ్లామర్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. కానీ.. కొన్నాళ్ళుగా సినిమాలు తగ్గించిన అమీషా.. ఇప్పుడు తన వయసును కూడా దృష్టిలో పెట్టుకొని.. రొమాన్స్ కి నో చెప్పేస్తుందట. తాను ఇప్పుడు హీరో సల్మాన్, సన్నీ డియోల్ లను ఫాలో అవుతున్నట్లు చెబుతోందట.
దాదాపు నాలుగేళ్ల బ్రేక్ తర్వాత గదర్ 2.. సినిమాతో తెరపై మెరసింది అమీషా. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేసింది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూల్ చేసి.. మరోసారి బాలీవుడ్ లో ఆశలు రేపింది. అయితే.. ప్రస్తుతం గదర్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది అమీషా. సినిమాల పరంగా గ్లామర్ షోకి దూరంగా ఉండే ఈ భామ.. వయసు పైబడుతున్నా వన్నె తరగని అందం మెయింటైన్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. అయితే.. ఎలాగో నెట్టింట గ్లామర్ షో చేస్తున్నారు కదా.. సినిమాలలో గ్లామర్ షో, రొమాంటిక్ సీన్స్ చేయడానికి రెడీగా ఉన్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ఇలా చెప్పిందట. తాను గ్లామర్ షో విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నానని.. సిల్వర్ స్క్రీన్ పై సల్మాన్, సన్నీలను ఫాలో అవుతానని తెలిపిందట. అంటే పర్సనల్ లైఫ్ లో ఎలా ఉన్నా.. స్క్రీన్ పై ఆ దారిలో వెళ్ళలేనని అమ్మడి సమాధానంగా బాలీవుడ్ మాట్లాడుకుంటోంది. మరి అమీషా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.