బన్నీ 22.. అట్లీ ప్లానింగ్ అదుర్స్ ఏకంగా ముగ్గురు !

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఆ కలెక్షన్స్ ను ఇంకెవరు బీట్ చేయలేరేమో అనే మార్క్ పడింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ అట్లీ తో జతకట్టబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ రిలేటెడ్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఆ కలెక్షన్స్ ను ఇంకెవరు బీట్ చేయలేరేమో అనే మార్క్ పడింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ అట్లీ తో జతకట్టబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ రిలేటెడ్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

సన్ పిక్చర్స్ నిర్మించబోయే ప్యాన్ ఇండియా అట్లీ బన్నీ కాంబోలో రాబోతుంది. దాదాపు ఈ సమ్మర్ లోనే రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారట మూవీ టీమ్. ఈ క్రమంలో ప్రెసెంట్ బన్నీ గెటప్ కు సంబంధించి .. VFX ఎలా ఉండాలి ఏంటి అనే దానిపైన వర్క్ షాప్స్ జరుగుతున్నట్లు సమాచారం. మూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు కానీ ఈ సినిమా గురించి మాత్రం అప్పుడే లీక్స్ వినిపించేస్తున్నాయి . అసలు సన్ పిక్చర్స్ ఇప్పటివరకు తమిళ వాళ్ళను తప్పు తెలుగు హీరోలను తీసుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ను తీసుకోవడంతో ఈ సినిమాపై అందరికి అంచనాలు పెరిగిపోతున్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్ లో నటించనున్నారని అంటున్నారు. పైగా ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఓ క్యారెక్టర్ పూర్తిగా యానిమేషన్ లో ఉండబోతుందట. ఇలా చిన్న చిన్న సీన్స్ , ఒకటి రెండు ఎపిసోడ్స్ లో కనిపించడం మామూలే కానీ.. ఇప్పటివరకు ఎవరు ఫుల్ లెంగ్త్ సినిమాలో ఇలాంటి రోల్ చేసే సాహసం అయితే చేయలేదు. పైగా ఈ మూడు క్యారెక్టర్స్ ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటుందంట. హాలీవుడ్ స్టాండర్డ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు.

పైగా ఇది అల్లు అర్జును కెరీర్ లోనే మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా. సో బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ రాజి పడడం లేదట. ఈ ఎలివేషన్స్ లో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ.. ఒకవేళ నిజం అయితే మాత్రం తమిళ్ లో టాలీవుడ్ మొదటి అడుగు బలంగా పడినట్లే అని చెప్పి తీరాల్సిందే. ప్రస్తుతానికి 2026 చివరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారట. ఒకవేళ అప్పుడు కాకపోతే 2027 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

Show comments