తల్లిని కావాలనుకుంటున్నా.. అందుకోసం ఎదురుచూస్తున్నా: స్టార్ హీరోయిన్

ఓ స్టార్ హీరోయిన్ తన జీవిత లక్ష్యం ఏంటి? అన్న ప్రశ్నకు వెరైటీగా ఆన్సర్ ఇచ్చింది. ఆ బ్యూటీకి అమ్మ అని పిలిపించుకోవాలని ఉందట. ఇక అందుకోసం వెయిట్ చేస్తున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఓ స్టార్ హీరోయిన్ తన జీవిత లక్ష్యం ఏంటి? అన్న ప్రశ్నకు వెరైటీగా ఆన్సర్ ఇచ్చింది. ఆ బ్యూటీకి అమ్మ అని పిలిపించుకోవాలని ఉందట. ఇక అందుకోసం వెయిట్ చేస్తున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రపంచంలో జీవించే ప్రతీ వ్యక్తికి ఓ కోరిక అనేది ఉంటుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలి.. అని రకరకాల కోరికలు ఉంటాయి. అయితే కొందరి డ్రీమ్స్ మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన జీవిత లక్ష్యం ఏంటి? అన్న ప్రశ్నకు వెరైటీగా ఆన్సర్ ఇచ్చింది. ఆ బ్యూటీకి అమ్మ అని పిలిపించుకోవాలని ఉందట. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

శోభిత ధూళిపాళ.. తెలుగు అమ్మాయి తలచుకుంటే.. ఏదైనా సాధించగలుగుతుందని నిరూపించింది.రామన్ రాఘవ్ 2.0 తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అడవి శేషు నటించిన ‘గూఢచారి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది. గూఢచారి, మేజర్, పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలతో ఓ రేంజ్ హీరోయిన్ గా మారిపోయింది. మూవీస్ తో పాటుగా ఓటీటీ ప్రాజెక్ట్ లతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.

ఇక ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా శోభితకు ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చి.. అందరికి షాకిచ్చింది. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటంటే? మీ లైఫ్ కు అసలైన అర్థం ఏంటి? మీ డ్రీమ్ ఏంటి? దీనికి శోభిత ఆన్సర్ ఇస్తూ..”మనిషి జీవితం ఒక తీరం నుంచి మరో తీరానికి ప్రయాణించడమే. అందుకే నేను లైఫ్ కు ఓ లక్ష్యం ఉంటుందని అనుకోను. ఏం చేసినా.. సంతోషంతో చేయాలి. నాకంటూ పెద్ద డ్రీమ్స్ ఏం లేవు. కానీ.. అమ్మను అవ్వడం, అమ్మా అని పిలిపించుకోవడం.. ఎంతో బాగుంటుంది. అందుకోసం ఎదురుచూస్తున్నాను” అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది శోభిత. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో.. నెటిజన్లు పలు రకాలుగా రాసుకొస్తున్నారు. మరి శోభిత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: బర్త్ డేకి గోల్డెన్ కేక్ కట్ చేసిన హీరోయిన్.. ఫొటోలు వైరల్!

Show comments