16 ఏళ్లకే హార్మోన్ ఇంజెక్షన్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

  • Author Soma Sekhar Published - 10:00 PM, Thu - 7 December 23

16 ఏళ్లకే హార్మోన్ల ఇంజెక్షన్లు వేసుకున్న వివాదంపై క్లారిటీ ఇచ్చింది స్టార్ హీరోయిన్. మరి ఆ నటి ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

16 ఏళ్లకే హార్మోన్ల ఇంజెక్షన్లు వేసుకున్న వివాదంపై క్లారిటీ ఇచ్చింది స్టార్ హీరోయిన్. మరి ఆ నటి ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 10:00 PM, Thu - 7 December 23

ఓ స్టార్ హీరోయిన్ 16 సంవత్సరాలకే హార్మోన్ల ఇంజెక్షన్స్ తీసుకుందని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి ఆ బ్యూటీ సినిమా వచ్చినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. దీనికి కారణం లేకపోలేదు. సదరు హీరోయిన్ తల్లి వృత్తిరిత్యా స్కిన్ స్పెషలిస్ట్ కావడంతో.. తన కూతురు యంగ్ గా కనిపించేందుకు హార్మోన్ల ఇంజెక్షన్స్ వాడినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరి ఆ హీరోయిన్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

హన్సిక మోత్వానీ.. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ సూపర్ కావడంతో.. ఈ ఆపిల్ బ్యూటీకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే కథల ఎంపికలో చేసిన తప్పుల వల్ల ఈ అమ్మడికి అనుకున్నంత పేరు రాలేదు. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ బ్యూటీ తాజాగా ‘మై నేమ్ ఈజ్ శృతి’ అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్కిన్ మాఫియా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక 16 ఏళ్లకే హార్మోన్ల ఇంజెక్షన్లు వేసుకున్న వివాదంపై క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై హన్సిక మాట్లాడుతూ..”నేను హార్మోన్ ఇంజెక్షన్లు వాడానన్న వార్తలన్నీ అబద్దమే. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. ఇలాంటి న్యూస్ మా అమ్మను ఎంతగానో బాధపెట్టింది. మా అమ్మ పరిస్థితి చూసి మేం కన్నీరు పెట్టుకున్నాం. ఇలాంటి రూమర్స్ నా మనసును విచ్చిన్నం చేశాయి” అంటూ చెప్పుకొచ్చింది హన్సిక. ఇక ఈ విషయాన్ని ఆమె తల్లి మోనా మోత్వానీ కూడా తీవ్రంగా ఖండించింది. మరి ఇప్పటికైనా ఈ విషయంపై రూమర్లు ఆగిపోతాయో? లేదో? చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments