Christian Oliver Passed away: విషాదం.. విమాన ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లతో సహ నటుడు దుర్మరణం!

విషాదం.. విమాన ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లతో సహ నటుడు దుర్మరణం!

సినీ పరిశ్రమలో ఈ మద్య వరుస విషాదాలు అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేస్తున్నాయి. ఈ మధ్యనే తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ కమెడియన్ బోండా మణి, స్టార్ హీరో, రాజకీయ నేత విజయ్ కాంత్ కన్నుమూశారు.. తర్వాత హాలీవుడ్ లో బ్యాట్ మాన్ ఫేమ్ టామ్ విల్కిన్సన్ కన్నుమూశారు.

సినీ పరిశ్రమలో ఈ మద్య వరుస విషాదాలు అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేస్తున్నాయి. ఈ మధ్యనే తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ కమెడియన్ బోండా మణి, స్టార్ హీరో, రాజకీయ నేత విజయ్ కాంత్ కన్నుమూశారు.. తర్వాత హాలీవుడ్ లో బ్యాట్ మాన్ ఫేమ్ టామ్ విల్కిన్సన్ కన్నుమూశారు.

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక వర్గానికి సంబందించిన వారు హార్ట్ ఎటాక్, వయోభారం, రోడ్డు ప్రమాదాలు ఇలా పలు కారణాల వల్ల చనిపోతున్నారు. మరికొంతమంది నటులు కెరీర్ సరిగా లేకపోవడం,  ఆర్థిక ఇబ్బందులతో డిప్రేషన్ లోకి వెళ్లి  ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ఏది ఏమైనా సెలబ్రెటీల మరణంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం తీరని దుఖఃంలో మునిగిపోతున్నారు. ఇటీవల ప్రముఖ స్టార్ హీరో విజయ్ కాంత్, హాలీవుడ్ నటుడు బ్యాట్ మ్యాన్ మూవీ ఫేమ్ టామ్ విల్కిన్సన్ కన్నుమూశారు. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే హాలీవుడ్ నటుడు విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..

హీలీవుడ్ లో ప్రముఖ నటుడు క్రిస్టియన్ ఒలీవర్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఇద్దరు కూతుళ్లు కూడా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. క్రిస్టయన్ ఒలీవర్ ప్రయాణిస్తున్న విమానం కరేబియన్ సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో క్రిస్టియన్ ఆయన ఇద్దరు కూతుళ్ళు దుర్మరణం చెందారు. జర్మనీలో జన్మించిన క్రిస్టియన్ ఒలీవర్ ‘ది గుడ్ జర్మన్’, 2008 లో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం ‘స్పీడ్ రేసర్’ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. గురువారం తన సొంత ప్లెయిన్ లో ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుకు కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు. విమానం కూలిపోయిన విషయాన్ని స్థానిక మత్స్యకారులు, కోస్టు గార్డులు, డైవర్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటీకే విమానంలో ప్రయాణిస్తున్నవారు మరణించారు.

ఈ ప్రమాద ఘటనా స్థలంలో నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఒలీవర్ తో పాలు ఆయన కుమార్తెలు మాదిత, అన్నిక్, విమాన పైటల్ రాబర్ట్ సాచ్ లు ఉన్నారని అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం గ్రెనడైన్స్ లో చిన్న ద్వీపం జెక్వియా నుంచి సెయింట్ లూసియాకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ మూవీ ‘వాల్కైరీ’ తో సహా 60 సినిమాలు, టెలివిజన్ షో, సీరియల్స్ లో నటించాడు క్రిస్టియన్ ఒలీవర్. జర్మన్ లో ‘అలారమ్ ఫర్ కోబ్రా 11’ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఒలీవర్ విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆయన మృతిపై సినీ, టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖులు నివాళులర్పించారు.

Show comments