డిగ్రీ పాస్ అయ్యారా? ఇంటర్వ్యూ కూడా లేకుండా RTCలో ఉద్యోగాలు రెడీ!

మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? మంచి వేతనంతో TSRTCలో ఉద్యోగాల భర్తీ కోెసం నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష, ఇంటర్య్వూ లేకుండానే ఈ ఉద్యోగాలను పొందే ఛాన్స్. అర్హులు ఎవరంటే?

మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? మంచి వేతనంతో TSRTCలో ఉద్యోగాల భర్తీ కోెసం నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష, ఇంటర్య్వూ లేకుండానే ఈ ఉద్యోగాలను పొందే ఛాన్స్. అర్హులు ఎవరంటే?

ప్రభుత్వ రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది టీఎస్ ఆర్టీసీ. నిత్యం వేలమంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తూ ప్రజాధారణ పొందింది. ప్రయాణికులకు సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది కోసం టీఎస్ ఆర్టీసీ నియామకాలు చేపడుతోంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. మంచి వేతనంతో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరి ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు? జీతం ఎంత? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్ల(డిపో/యూనిట్‌)లో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 150 ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫిబ్రవరీ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్య్వూ లేకుండానే ఈ ఉద్యోగాలను దక్కించుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://www.tsrtc.telangana.gov.in/ వెబ్ సైట్ ను పరిశీలించాల్పి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీల సంఖ్య:

  • 150

అర్హత:

  • బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ కోర్సు 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:

  • అభ్యర్థులు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ట్రైనింగ్ పీరియడ్:

  • మూడు సంవత్సరాలు

జీతం:

  • స్టైఫండ్‌ రూపంలో… మొదటి సంవత్సరం రూ. 15000, రెండో సంవత్సరం రూ. 16000, మూడో సంవత్సరం రూ. 17000 చెల్లిస్తారు

ఎంపిక విధానం:

  • ఈ ఉద్యోగాలకు ధ్రువపత్రాల పరిశీలన,స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులకు చివరితేది:

  • 16-02-2024.

అప్లై చేసుకోవడానికి వెబ్‌సైట్‌:

Show comments