రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 52వేల జీతం

మీరు టెన్త్, ఐటీఐ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్ కెమికల్స్‌ కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్‌((ఐటీఐ) హోల్డర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు టెన్త్, ఐటీఐ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్ కెమికల్స్‌ కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్‌((ఐటీఐ) హోల్డర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వెంటనే అప్లై చేసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకు ఇదే మంచి అవకాశం. ప్రభుత్వ ఫర్టిలైజర్ కంపెనీలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. భారీ వేతనంతో కూడిన ఈ జాబ్స్ ను టెన్త్, ఐటీఐ అర్హతతోనే మీరు పొందే వీలుంది. తెలంగాణలోని రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్ కెమికల్స్‌ కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్‌((ఐటీఐ) హోల్డర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. యూరియా ఉత్పత్తిలో రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఏ ఉద్యోగాలను వదిలినా ఈ ఉద్యోగాలను మాత్రం అస్సలు వదలకండి.

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో అటెండెంట్‌ గ్రేడ్ 1లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 39 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా ఫిబ్రవరి 22న ముగియనున్నది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్ కెమికల్స్‌ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ https://rfcl.co.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు:

  • 39

విభాగాల వారీగా ఖాళీలు:

మెకానికల్ విభాగం:

  • ఫిట్టర్‌ పోస్టులు 10, డీజిల్ మెకానిక్‌ 3, మెకానిక్‌ హెవీ వెహికల్‌ రిపేర్స్‌-మెయింటెయినెన్స్‌ 2 పోస్టులు

ఎలక్ట్రికల్ విభాగం:

  • 15 ఎలక్ట్రిషియన్ పోస్టులు

ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగం:

  • ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ విభాగంలో 4పోస్టులు, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ పోస్టులు 5

అర్హత:

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి ఐటీఐ సర్టిఫికేట్‌తో పాటు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల కనీస వయసు 18 సంత్సరాలు, గరిష్ట వయసు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు.

ఎంపిక విధానం:

  • ఈ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 21500 నుంచి 52000 వరకు అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు ప్రారంభం:

  • 24-01-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 22-02-2024

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్ కెమికల్స్‌ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్:

Show comments