10th ఉంటే చాలు? ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీవే.. నెలకు 69 వేల జీతం

ITBP Recruitments 2024: పదో తరగతి పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ ఉద్యోగాలను అస్సలు వదలకండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. నెలకు 69 వేల జీతం అందుకోవచ్చు.

ITBP Recruitments 2024: పదో తరగతి పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ ఉద్యోగాలను అస్సలు వదలకండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. నెలకు 69 వేల జీతం అందుకోవచ్చు.

ఆర్థిక పరిస్థితి కారణంగా చాలామంది టెన్త్ పూర్తవగానే చదువు మానేస్తుంటారు. ప్రతిభ ఉన్నా కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరమవతుంటారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని గడుపుతుంటారు. పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే బాగుండని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. మీరు టెన్త్ పాసైతే చాలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందొచ్చు. టెన్త్ అర్హతతో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది బెస్ట్ ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) పలు ఉద్యోగా భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ఫోర్స్‌లో నాన్‌ మినిస్టీరియల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానిస్టేబుల్‌/ట్రేడ్స్‌మెన్‌ గ్రూప్‌ సి నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. పురుష, మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించారు. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 18 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్య సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 51.

పోస్టుల వివరాలు:

  • కానిస్టేబుల్‌(టైలర్‌)–18, కానిస్టేబుల్‌(కోబ్లర్‌)–33.

అర్హత:

  • టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత­తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 18.08.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

  • ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • నెలకు రూ.21,700 నుంచి రూ.69,100

దరఖాస్తు ఫీజు:

  • అన్ రిజర్వ్డ్, ఈడబ్య్లూఎస్ వారు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది:

  • 20-07-2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:

  • 18-08-2024
Show comments