Union Bankలో 606 ఉద్యోగాలు.. నెలకు రూ.89 వేల వరకు జీతం

మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్నట్లైతే భారీ శుభవార్త. ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నది.

మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్నట్లైతే భారీ శుభవార్త. ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నది.

మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్దమవుతున్నారా? బ్యాంకు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 606 ఖాళీలను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://www.unionbankofindia.co.inను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు మొత్తం

  • 606

 

  • చీఫ్ మేనేజర్ (ఐటీ): 05
  • సీనియర్ మేనేజర్ (ఐటీ): 42
  • మేనేజర్ (ఐటీ): 04
  • మేనేజర్ (రిస్క్): 27
  • మేనేజర్ (క్రెడిట్): 371
  • మేనేజర్ (లా): 25
  • మేనేజర్ (ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్): 05
  • మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్): 19
  • అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్): 02
  • అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ ఇంజినీర్): 02
  • అసిస్టెంట్ మేనేజర్ (ఆర్కిటెక్ట్): 01
  • అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్): 30
  • అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్): 73

అర్హతలు:

  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఎస్సీ/బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ/ సీఏ/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్/ సీఎఫ్‌ఏ సర్టిఫికేట్/ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు 20 నుంచి 45 ఏళ్ల వరకు వయసు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీల వారికి వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • దరఖాస్తుల పరిశీలన, ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం:

  • చీఫ్ మేనేజర్ పోస్టులకు రూ.76,010-రూ.89,890.
  • సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ.63840-రూ.78,230.
  • మేనేజర్ పోస్టులకు రూ.48,170-రూ.69,810.
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.36,000-రూ.63,840.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 03-02-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 23-02-2024
Show comments