Indian Navy Recruitment 2024: ఈ అవకాశం వదలొద్దు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 56 వేల జీతం

ఈ అవకాశం వదలొద్దు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 56 వేల జీతం

మీరు ఇండియన్ నేవీలో చేరే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?

మీరు ఇండియన్ నేవీలో చేరే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?

ఇటీవల ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆర్మీ, ఇంకా ఇతర డిపార్ట్ మెంట్స్ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. తాజాగా త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా పలు విభాగాల్లో 254 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదలొద్దు. అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీపడొచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ప్రారంభ వేతనం రూ. 56 వేలు అందిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి కేరళలోని ఎజిమలలోని ‘ఇండియన్ నేవీ అకాడమీ’లో 2025 జనవరిలో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైంది. మార్చి 10 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఇండియన్ నేవీ అధికారికి వెబ్ సైట్ https://www.joinindiannavy.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ మొత్తం ఖాళీల సంఖ్య:

  • 254

విభాగాల వారీగా ఖాళీలు:

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్:

  • 136

ఎడ్యుకేషన్ బ్రాంచ్:

  • 18

టెక్నికల్ బ్రాంచ్:

  • 100

అర్హతలు:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి 1998 నుంచి 2006 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం:

  • విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్​ లిస్ట్​ అయిన అభ్యర్థులకు ఎస్​ఎస్​బీ ఇంటర్వ్యూకు ఎంపికైన విషయాన్ని ఈ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. మెడికల్ టెస్టులో ఫిట్​గా తేలిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రారంభ వేతనం:

  • ఎస్​ఎల్​టీ బేసిక్ పే కింద రూ.56,100 ఇస్తారు. దీంతోపాటు ఇతర అలవెన్సులూ ఉంటాయి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తుకు చివరితేది:

  • 24-02-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 10-03-2024
Show comments