P Venkatesh
మీరు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు భారీ శుభవార్త. సదరన్ రైల్వే 2,860 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.
మీరు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు భారీ శుభవార్త. సదరన్ రైల్వే 2,860 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.
P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మీరు రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకు ఇదే మంచి అవకాశం. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు ఈ నోటిఫికేషన్ ను అస్సలు వదలకండి. ఇటీవల సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2,860 పోస్టులను భర్తీ చేయనున్నారు. సదరన్ రైల్వే పరిధిలోని పలు డివిజన్లలోని పలు ట్రేడుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
చెన్నై డివిజన్, పాలక్కడ్ డివిజన్, తిరువనంతపురం డివిజన్, సాలెమ్ డివిజన్, మధురై డివిజన్, తిరుచిరాపల్లి డివిజన్, కోయంబత్తూర్, పెరంబూర్ తదితర యూనిట్స్ లలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 28వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం సదరన్ రైల్వే అధికారికి వెబ్ సైట్ https://sr.indianrailways.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకు వయోపరిమితి ఎంత? ఎంపిక విధానం? దరఖాస్తు ఫీజు ఎంత? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.