P Venkatesh
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బొగ్గు గనుల్లో 1425 ఉద్యగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక కావొచ్చు. అభ్యర్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బొగ్గు గనుల్లో 1425 ఉద్యగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక కావొచ్చు. అభ్యర్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి.
P Venkatesh
మీరు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకునే అవకాశం వచ్చింది. బొగ్గు గనుల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్ష, ఇంటర్య్వూ లేకుండానే ఈ ఉద్యోగాలను పొందొచ్చు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని సౌత్-ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(ఎస్‌ఈసీఎల్) గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1425 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
పోస్టులను అనుసరించి డిగ్రీ/డిప్లొమా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 27 వరకు దరఖాస్తుల చేసుకునేందుకు గడువు విధించారు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వెంటనే అప్లై చేసుకోండి. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఎస్‌ఈసీఎల్ అధికారిక వెబ్ సైట్ ను https://www.secl-cil.in/పరిశీలించాల్సి ఉంటుంది.