P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఇదే మంచి ఛాన్స్. లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్ కొడితే లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. అర్హులు ఎవరంటే?
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఇదే మంచి ఛాన్స్. లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్ కొడితే లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. అర్హులు ఎవరంటే?
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతటి కాంపిటీషన్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఏ చిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయినా లక్షలాది మంది పోటీపడుతున్నారు. ప్రైవేట్ సెక్టార్ లో లక్షలు సంపాదించే కొలువులున్నప్పటికీ గవర్నమెంట్ జాబ్ కు ఉండే డిమాండ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఈ కారణంగానే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు యువత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి లైఫ్ లో స్థిరపడిపోవాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. లక్షకు పైగా జీతంతో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఆ వివరాలు మీకోసం..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 968 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://ssc.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.