ఈ అర్హతలుంటే చాలు.. నెలకు రూ. 40 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీరు అవకాశాన్ని అస్సలు వదలొద్దు. నెలకు రూ. 40 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీరు అవకాశాన్ని అస్సలు వదలొద్దు. నెలకు రూ. 40 వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.

నిరుద్యోగులు మీరు జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడాలంటే ఇదే మంచి అవకాశం. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 40 వేల వరకు జీతం అందిస్తారు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 517 ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్‌ అండ్‌ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు బెల్ అధికారిక వెబ్ సైట్ https://bel-india.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్య సమాచారం :

ట్రైనీ ఇంజినీర్ పోస్టులు:

  • 517

అర్హత:

  • బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి:

  • బీఈ/ బీటెక్‌ అభ్యర్థులకు 28 ఏళ్లుగా నిర్ణయించారు. ఎంఈ/ ఎంటెక్‌ అభ్యర్థులకు 30 ఏళ్లు ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 అందిస్తారు.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.150 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

దరఖాస్తులు ప్రారంభం:

  • 28-02-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 13-03-2024
Show comments