BHEL Recruitment 2023: డిగ్రీ, డిప్లొమా అర్హతతో బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు

డిగ్రీ, డిప్లొమా అర్హతతో బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 01 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

నిరుద్యోగులకు శుభవార్త. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 01 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ ఉద్యోగమైతే నెల తిరిగేసరికల్లా అకౌంట్ లోకి శాలరీ చింతన లేని జీవితాన్ని పొందొచ్చు. అదే ప్రైవేట్ సెక్టార్ అయితే టెన్షన్ తో కూడుకున్న పని. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్తను అందించింది భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

బీహెచ్ఈఎల్ మొత్తం 680 అప్రెంటీస్ ఖాళీల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిగ్రీ, డిప్లొమా అర్హతలతో ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 01 2023తో ముగియనున్నది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ www.bhel.com ను సందర్శించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

అప్రెంటీస్ ఖాళీలు మొత్తం:

  • 680

ట్రేడ్ అప్పెంటిస్:

  • 398 ఖాళీలు

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:

  • 179 ఖాళీలు

టెక్నీషియన్ అప్రెంటిస్:

  • 103 ఖాళీలు

అర్హత:

  • అభ్యర్థులు పోస్టులను బట్టి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థల నుంచి ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయో పరిమితి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అసెస్‌మెంట్ టెస్ట్‌లో అభ్యర్థులు సాధించిన స్కోర్‌ల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేసి అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

వేతనం:

  • ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 7,700 నుంచి రూ. 900 వేల వరకు అందిస్తారు.

దరఖాస్తు చివరి తేదీ:

  • 01-12-2023

బీహెచ్ఈఎల్ అధికారిక వెబ్ సైట్:

Show comments