LLB చేసి ఖాళీగా ఉన్నారా.. ఈ కోర్టు జాబ్స్ మీకోసమే.. మిస్ చేసుకోకండి

Telangana High Court Law clerks Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే కోర్ట్ జాబ్స్ మీకోసమే. ఎల్ ఎల్ బీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నట్లైతే వెంటనే అప్లై చేసుకోండి.

Telangana High Court Law clerks Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే కోర్ట్ జాబ్స్ మీకోసమే. ఎల్ ఎల్ బీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నట్లైతే వెంటనే అప్లై చేసుకోండి.

కొందరికి న్యాయవాద వృత్తి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. లాయర్ అవ్వాలని కలలుకంటుంటారు. ఇందుకోసం లా కోర్సులు అభ్యసిస్తుంటారు. కోర్సులు పూర్తైన తర్వాత కోర్టుల్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. మరికొంత మంది కోర్ట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు ఎల్ ఎల్బీ గ్రాడ్యుయేట్స్. జూనియర్ సివిల్ జడ్జ్, క్లర్క్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. మరి మీరు కూడా కోర్టు జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? కోర్టు జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? మీరు ఎల్ ఎల్ బీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీకానున్నాయి.

తెలంగాణహైకోర్టులో పనిచేసేందుకు 31 లా క్లర్క్‌లు, సికింద్రాబాద్ లోని స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో పనిచేసేందుకు 2 లా క్లర్క్‌ల పోస్టులు భర్తీకానున్నాయి. క్లర్క్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 3 లేదా 5 సంవత్సరాల లా డిగ్రీని కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10+2 పూర్తి చేసిన తర్వాత 5 ఏళ్లు రెగ్యులర్ లా అభ్యసించాలి. లేదా 10+2 పాఠశాల విద్య తర్వాత మూడేళ్ల డిగ్రీ కోర్సు, ఆ తర్వాత 3 సంవత్సరాల రెగ్యులర్ లా డిగ్రీ పూర్తిచేయాలి. లా డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, పని అనుభవం కలిగి ఉండాలి. లా క్లర్క్ నోటిఫికేషన్ విడుదల తేదీకి రెండేళ్ల ముందుగా అభ్యర్థి న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 23వ తేదీ వరకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ దరఖాస్తులను “ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్” చిరునామాకు పంపించాలి. వయస్సు, విద్యార్హత పత్రాల కాపీలు జోడించాలి. అర్హతలు, అక్నాలెడ్జ్‌మెంట్ తో రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా హైకోర్టు అడ్రస్ కు నవంబర్ 23 సాయంత్రం 5.00 గంటల లోపు పోస్టు చేయాలి. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం tshc.gov.in వెబ్‌సైట్‌ పరిశీలించాల్సి ఉంటుంది. ఎల్ ఎల్ బీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నవారు ఈ పోస్టులను వదులుకోకండి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి.

Show comments