రాత పరీక్ష లేకుండా రైల్వేలో 1791 Jobs రెడీ.. ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్.. మిస్ చేసుకోకండి

RRC NWR Apprentice Recruitment 2024: మీరు రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే 1791 జాబ్స్ రెడీగా ఉన్నాయి. అప్లై చేసి జాబ్ కొట్టొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

RRC NWR Apprentice Recruitment 2024: మీరు రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే 1791 జాబ్స్ రెడీగా ఉన్నాయి. అప్లై చేసి జాబ్ కొట్టొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

రైల్వేలో లోకో పైలట్, క్లర్క్, స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్, జూనియర్ టైమ్ కీపర్, జూనియర్ ఇంజినీర్ ఇలా రకరకాల జాబ్స్ ఉంటాయి. వీటిల్లో ఏ జాబ్ సాధించినా లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకుని ఉన్నత స్థానంలో స్థిరపడిపోవచ్చు. మంచి జీతం, అలవెన్సులు అందుకోవచ్చు. అందుకే రైల్వే జాబ్స్ కు కాంపిటీషన్ వేరే లెవల్ లో ఉంటుంది. రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి ఏ చిన్న నోటిఫికేషనన్ రిలీజ్ అయినా సరే దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పోటీపడుతుంటారు. మరి మీరు కూడా రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? రైల్వే జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. రాత పరీక్ష రాయకుండానే రైల్వే జాబ్ దక్కించుకునే అవకాశం వచ్చింది.

ఈజీగా జాబ్ కొట్టొచ్చు. కేవలం టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా రైల్వే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. అప్లై చేస్తే చాలు జాబ్ పక్కాగా పొందే అవకాశం. వంద, రెండు వందలు కాదు ఏకంగా 1791 జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్, నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్ డబ్య్లూఆర్ పరిధిలోని వర్క్ షాప్ లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1791 పోస్టులను భర్తీ చేయనున్నారు. కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్ వెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితర ట్రేడుల్లో భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు పోటీపడే వారు టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. దరఖాస్తు ఫీజుగా రూ. 100 చెల్లించాలి. ఎస్టీ/ఎస్సీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 10 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ rrcjaipur.in ను సందర్శించాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వారు ఈ జాబ్స్ ను మిస్ చేసుకోకండి. మీరు కలలు కన్న రైల్వే జాబ్ కోసం అప్లై చేసి జాబ్ కొట్టండి.

Show comments