ఇంటర్వ్యూ, రాత పరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్.. రైల్వేలో 5647 జాబ్స్ రెడీ

Northeast Frontier Railway Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో 5647 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.

Northeast Frontier Railway Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో 5647 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.

భారతీయ రైల్వే నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నది. సామాన్యుడి నేల విమానంగా పేరొందిన ట్రైన్ జర్నీకి ఆదరణ ఎక్కువ. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రైల్వే ఛార్జీలు తక్కువగా ఉండడం.. సమయం ఆదా అవడంతో రైలు ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. రైల్వే డివిజన్లలో అవసరమైన సిబ్బంది కోసం నియామకాలు చేపడుతున్నది. ఇటీవల రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి వేలల్లో పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. లోకో పైలట్, అసిస్టెంట్ లోకోపైలట్, క్లర్క్, ఇలా పలు పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఇవి కాకుండా అప్రెంటిస్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. మరి మీరు కూడా రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇంటర్వ్యూ, రాతపరీక్ష లేకుండానే సొంతం చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్ మెంట్ సెల్-నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ రైల్వే… ఎన్ఎఫ్ఆర్ పరిధిలోని డివిజన్/వర్క్ షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 5647 జాబ్స్ ను భర్తీ చేయనున్నది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, ఎస్ అండ్ టీ, పర్సనల్, అకౌంట్స్, మెడికల్ విభాగాల్లో భర్తీకానున్నాయి.

ఇంటర్వ్యూ, రాత పరీక్ష లేకుండానే జాబ్ పొందొచ్చు. రైల్వే జాబ్ కోసం చూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ, ఇంటర్, ఎంఎల్ టీ పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు టెన్త్, ఐటీఐ మార్క్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ లో డిసెంబర్ 3 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం రైల్వే అధికారిక వెబ్ సైట్ www.rrcpryj.org ను పరిశీలించాల్సి ఉంటుంది.

Show comments