భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ లో జాబ్స్.. నెలకు 55 వేల జీతం.. వెంటనే అప్లై చేసుకోండి

Bharat Electronics Limited: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

Bharat Electronics Limited: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

దేశంలో పట్టాభద్రుల సంఖ్య పెరుగుతున్నది. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలంటే ప్రభుత్వానికి సాధ్యం కాని విషయం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. స్కిల్స్ డెవలప్ చేసుకుని ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్, ఈకామర్స్ సంస్థల్లో, పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అయితే ప్రైవేట్ సెక్టార్ లో శాలరీస్ ఎక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ జాబ్స్ గాల్లో దీపాలమాదిరిగా ఉంటాయి. ఎప్పుడు జాబ్ ఊడుతుందో అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి. అందుకే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అయితే సెక్యూరిటీ ఉంటుంది.

శాలరీతో పాటు సౌకర్యాలు కూడా పొందొచ్చు. అందుకే ప్రభుత్వ కొలువులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. ట్రైనీ ఇంజినీర్‌-1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 77 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు 49, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు 28 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పోటీపడేవారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

అభ్యర్థుల వయసు ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.35 వేలు, మూడో ఏడాది రూ.40 వేలు చెల్లిస్తారు. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు మొదటి ఏడాది రూ.40 వేలు, రెండో ఏడాది రూ.45 వేలు, మూడో ఏడాది రూ.50 వేలు నాలుగో ఏడాది రూ.55 వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజుగా ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులకు రూ.150, ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 9 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం bel-india.in వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

Show comments