డిగ్రీ ఉంటే చాలు.. ఈ Bank జాబ్స్ మీకోసమే.. నెలకు లక్షన్నర జీతం

Bank of Maharashtra Recruitment 2024,: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ స్కేల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Bank of Maharashtra Recruitment 2024,: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ స్కేల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

మీరు బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంక్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీరు డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ స్కేల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 195 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరి ఈ జాబ్స్ కు వయోపరిమితి ఎంత? ఎంపిక విధానం ఏంటీ? ఆ వివరాలు మీకోసం..

డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ జాబ్స్ ను నియమించుకోనున్నది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర వరకు జీతం పొందొచ్చు. అభ్యర్థులు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. గరిష్టంగా 50 ఏళ్లు కలిగి ఉండాలి. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 195

పోస్టులు వివరాలు:

  • డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్.

విభాగాలు:

  • ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్ మెంట్
  • ఫారెక్స్ అండ్ ట్రెజరీ
  • ఐటీ/డిజిటల్ బ్యాంకింగ్/ సీఐఎస్ఓ/ సీడీఓ
  • క్రెడిట్, ఎకనామిస్ట్ తదితర విభాగాలు

అర్హత:

  • అభ్యర్థులు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • గరిష్టంగా 50 ఏళ్లు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • పోస్టులను అనుసరించి 64 వేల నుంచి లక్షన్నర వరకు అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 118గా నిర్ణయించారు. ఇతరులకు రూ. 1180 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్.ఆర్.ఎం డిపార్ట్ మెంట్, హెడ్ ఆఫీస్, లోక్ మంగల్, శివాజీనగర్, పుణె చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులు ప్రారంభం:

  • 11-07-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 26-07-2024
Show comments