P Venkatesh
IDBI Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐడీబీఐలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 31 వేల జీతం పొందొచ్చు. ఇప్పుడే అప్లై చేసుకోండి.
IDBI Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐడీబీఐలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 31 వేల జీతం పొందొచ్చు. ఇప్పుడే అప్లై చేసుకోండి.
P Venkatesh
నేటి రోజుల్లో చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం చేస్తున్న వారే ఎక్కువ. క్వాలిఫికేషన్ ఉండి స్కిల్స్ లేక కొందరు సరైన జాబ్ పొందలేక పోతున్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా జాబ్ తెచ్చుకోవడం గగనమైపోయింది. జాబ్స్ కు కాంపిటీషన్ హెవీగా పెరిగిపోయింది. జాబ్ కోసం ట్రై చేసి చాలా మంది ఏదో ఒక పనిలో స్థిరపడిపోతున్నారు. మరికొందరు బిజినెస్ చేస్తూ.. స్వయం ఉపాధి ఏర్పర్చుకుని జీవిస్తున్నారు. ఇక ప్రైవేట్ సెక్టార్ లో అయితే శాలరీలు తక్కువ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఎప్పుడు జాబ్ పోతుందోనని టెన్షన్ పడాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటారు. ప్రభుత్వ శాఖల్లో వందల్లో పోస్టులు ఉంటే లక్షల్లో పోటీపడుతున్నారు.
మరి మీరు కూడా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? మీరు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా? మీ క్వాలిఫికేషన్ కు మంచి జీతంతో కూడిన ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? డిగ్రీ అర్హతతో బ్యాంక్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు. జాబ్ లేదని వర్రీ అవుతున్నవారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన 2025-26 ఇయర్ కు గాను దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1000 పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయసు 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యూమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్ మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 29 వేల నుంచి 31 వేల వరకు అందిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 1050 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 250గా నిర్ణయించారు. అప్లికేషన్ ప్రక్రియ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 16 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ www.idbibank.inను సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేందుకు ఇంకా ప10 రోజులు గడువు మాత్రమే ఉంది. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు వెంటనే అప్లై చేసుకోండి.