P Venkatesh
మీరు నిరుద్యోగులా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఓ మంచి అవకాశం వచ్చింది. ఆ జిల్లాలో కొత్తగా మీ సేవా సెంటర్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. వెంటనే అప్లై చేసుకోండి.
మీరు నిరుద్యోగులా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఓ మంచి అవకాశం వచ్చింది. ఆ జిల్లాలో కొత్తగా మీ సేవా సెంటర్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. వెంటనే అప్లై చేసుకోండి.
P Venkatesh
మీ సేవా సెంటర్లు అందుబాటులోకి వచ్చాక పౌర సేవలు మరింత సులువయ్యాయి. ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికేట్లను మీ సేవా కేంద్రాల ద్వారా సులభంగా ఆన్ లైన్ లో పొందుతున్నారు. మీ సేవా సెంటర్లు లేనప్పుడు వివిధ రకాల సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మీ సేవా సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ సేవా సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందడమే గాక నిరుద్యోగులకు ఉపాధిమార్గాలుగా మారాయి. మీరు కూడా మీ సేవా సెంటర్ లను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. తెలంగాణలోని ఆజిల్లాలో మీ సేవా సెంటర్ల ఏర్పాటు కోసం నోటిఫికేషన్ వెలువడింది.
నారాయణపేటలోని జిల్లా ఈ-గవర్నెన్స్ సొసైటీ నారాయణపేట జిల్లాలో కొత్తగా మీసేవా సెంటర్‌ల ఏర్పాటు చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లాలోని 20 గ్రామాల్లో కొత్తగా మీసేవా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. క్యాతన్ పల్లి,కిస్టపుర్,గోటుర్, గుండ్మాల్, కొత్తపల్లి, మద్దూరు, మక్తల్, చిత్యల్, కన్మనుర్, కోటకొండ, నారాయణపేట తదితర గ్రామాల్లో మీసేవా సెంటర్ ఖాళీలున్నాయి. డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కలిగిన కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. మీసేవా ఏర్పాటు చేయు అభ్యర్థులు ఆ గ్రామపంచాయతి స్థానికులై ఉండాలి. అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై రాత పరీక్ష నిర్వహించబడుతుంది. ఎంపికైన అభ్యర్థికి మీసేవా కేంద్రం ఏర్పాటు చేయుటకు తగిన ఆర్ధిక స్థోమత కలిగి ఉండవలెను. పూర్తి వివరాలకు నారాయణపేట జిల్లా అధికారిక వెబ్ సైట్ ను https://narayanpet.telangana.gov.in/ పరిశీలించాల్సి ఉంటుంది.