నిరుద్యోగులకు యాపిల్ గుడ్ న్యూస్.. కొత్తగా 6 లక్షల ఉద్యోగాలు.. మీరూ ట్రై చేస్తారా?

Apple: నిరుద్యోగులకు యాపిల్ గుడ్ న్యూస్ అందించింది. భారత్ లో 6 లక్షల జాబ్స్ కల్పించనున్నట్లు తెలిపింది. భారత్ లో తమ ఆపరేషన్స్ విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆపిల్ సంకేతాలిచ్చింది.

Apple: నిరుద్యోగులకు యాపిల్ గుడ్ న్యూస్ అందించింది. భారత్ లో 6 లక్షల జాబ్స్ కల్పించనున్నట్లు తెలిపింది. భారత్ లో తమ ఆపరేషన్స్ విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆపిల్ సంకేతాలిచ్చింది.

వరల్డ్ వైడ్ గా దిగ్గజ టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపాలుగా మారాయి. కొత్తగా నియామకాలు కూడా జరగని పరిస్థితి నెలకొంది. రిక్రూట్ మెంట్ లేక ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు, ఫ్రెషర్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇలాంటి సమయంలో ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. వందలు కాదు వేలు కాదు ఏకంగా 6 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. భారత్ లోనే ఈ ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొంది.

పట్టభద్రులైన వారు లక్షలాది మంది ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. యాపిల్ కంపెనీ వచ్చే ఏడు నెలల్లో అంటే మార్చికల్లా 6 లక్షల జాబ్స్ కల్పించనున్నట్లు తెలిపింది. భారత్ లో తమ ఆపరేషన్స్ విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆపిల్ సంకేతాలిచ్చింది. వాటిలో రెండు లక్షల పత్యక్ష ఉద్యోగాలు ఉంటాయి. అందులోనూ మహిళా ఉద్యోగుల వాటా 70 శాతం ఉంటుంది. 6 లక్షల కొత్త ఉద్యోగాలు రానుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యాపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఎక్కువ. యాపిల్ తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు పలు దేశాల్లో యాపిల్ కేంద్రాలను నెలకొల్పుతున్నది. భారత్ లో కూడా 2021లో యాపిల్ ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. 2020లో కేంద్రం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం కింద ఆపిల్, దాని ఐ-ఫోన్ల తయారీ సంస్థలు 1.65 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇప్పటికే భారత్‌లో ఆపిల్ ఐ-ఫ్లోన్ల తయారీ సంస్థలు – ఫాక్స్ కాన్, విస్ట్రన్ (ప్రస్తుతం టాటా ఎలక్ట్రానిక్స్), పెగాట్రాన్ కలిసి 80,872 ఉద్యోగాలు కల్పించాయి.

Show comments