P Venkatesh
కుటుంబ అవసరాల కోసం ఉద్యోగాల్లో చేరిన వారు బీటెక్ కోర్స్ పూర్తి చేయాలన్న తమ కలను నెరవేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఏఐసీటీఈ. ఉద్యోగం చేస్తూనే ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి బీటెక్ పట్టా పొందవచ్చు.
కుటుంబ అవసరాల కోసం ఉద్యోగాల్లో చేరిన వారు బీటెక్ కోర్స్ పూర్తి చేయాలన్న తమ కలను నెరవేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఏఐసీటీఈ. ఉద్యోగం చేస్తూనే ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి బీటెక్ పట్టా పొందవచ్చు.
P Venkatesh
ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీపై అవగాహన పెంచుకుని దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందినట్లైతే కెరీర్ పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఏఐ, చాట్ జీపీటి అంటూ టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే యువత సాంకేతిక విద్యవైపు అడుగులు వేస్తోంది. టెక్నికల్ విద్యలో పట్టా పొంది ప్రముఖ కంపెనీల్లో ఉన్నతమైన ఉద్యోగం పొందేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే బీటెక్ వంటి విద్యను అభ్యసించాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ క్రమంలో కొంత మంది పాలిటెక్నిక్ వంటి కోర్సులు చేసి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. అలాంటి వారు మళ్లీ బీటెక్ చదువుకోవచ్చు. ఉద్యోగం చేస్తూనే బీటెక్ కోర్సు చదువుకునే సౌలభ్యాన్ని ఏఐసీటీఈ కల్పిస్తోంది.
ఇంజనీరింగ్ చదవాలనే కోరిక ఉన్నవారు తమ కలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తూనే ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేయొచ్చు. ఈ క్రమంలో పరిశ్రమల్లో పనిచేసే వృత్తి నిపుణులు బీటెక్ లో చేరే అవకాశం కల్పిస్తూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం చేస్తున్న వారికి బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ పేరుతో బీటెక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్లు కల్పిస్తారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే బీటెక్ పూర్తి చేసి పట్టా పొందొచ్చు.
ఈ కోర్సును నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని 12 ఇంజినీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇటీవలే అనుమతినిచ్చింది. ఈ విద్యాసంవత్సరంలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించింది. కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ వంటి ప్రోగ్రాముల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పిస్తారు.
విధివిధానాలు
వర్కింగ్ ప్రొఫెషనల్స్ నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. అడ్మిషన్లు కల్పించేందుకు ప్రవేశ పరీక్షను కాలేజీలోనే నిర్వహిస్తారు. సాయంత్రం లేదా వారాంతాల్లో తరగతుల నిర్వహణ ఉంటుంది. ఫీజులను కాలేజీలే నిర్ణయిస్తాయి. ఓయూలో సంవత్సరానికి రూ. 1 లక్షగా ఖరారుచేశారు.
తెలంగాణలో అడ్మిషన్లు కల్పించే కాలేజీల లిస్టు
కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ – కొత్తగూడెం, అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్, అనుబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ, తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ, వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, మాటూరి వెంకటసుబ్బారావు ఇంజినీరింగ్ కాలేజీ.