Nidhan
టీ20 వరల్డ్ కప్‌లో ఆడే భారత జట్టును మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. అయితే స్క్వాడ్‌లో ఆ నలుగురికి అవకాశం లేనట్లేనని చెప్పాలి. ఎవరా నలుగురు అనేది ఇప్పుడు చూద్దాం..
టీ20 వరల్డ్ కప్‌లో ఆడే భారత జట్టును మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. అయితే స్క్వాడ్‌లో ఆ నలుగురికి అవకాశం లేనట్లేనని చెప్పాలి. ఎవరా నలుగురు అనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌కు ఇంకా నెల సమయం కూడా లేదు. దీంతో అన్ని దేశాలు తమ ఆటగాళ్లను మెగా టోర్నీ కోసం సన్నద్ధం చేస్తున్నాయి. చాలా కంట్రీస్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడుతూ బిజీబిజీగా ఉన్నారు. ఇదే ప్రాక్టీస్‌తో వాళ్లు మెగా టోర్నీకి వెళ్లనున్నారు. ఈ రెండ్రోజుల్లో అన్ని దేశాలు తమ స్క్వాడ్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. పొట్టి ప్రపంచ కప్‌లో ఆడే భారత జట్టును మరికొన్ని గంటల్లో అనౌన్స్ చేయనున్నారు. దీంతో ఎవరెవరికి అవకాశం లభిస్తుంది? స్క్వాడ్‌లో ఎవరెవరు ఉంటారో తెలుసుకునేందుకు అందరూ ఎగ్జయింట్‌గా ఉన్నారు. అయితే టీమ్‌లో ఆ నలుగురికి అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. ఎవరా నలుగురు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో నలుగురు స్టార్లకు ఛాన్స్ లేనట్లేనని తెలుస్తోంది. అందరూ అనుకుంటున్నట్లే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ప్రపంచ కప్ టికెట్ దక్కలేదట. అయితే పాండ్యాతో పాటు మరో ముగ్గురికి కూడా భారత సెలెక్టర్లు మొండిచెయ్యి చూపారట. ఆ ముగ్గురు మరెవరో కాదు.. యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్, పించ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, ఫినిషర్ రింకూ సింగ్ అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. పాండ్యాతో పాటు ఈ ముగ్గురికీ వరల్డ్ కప్ టీమ్‌లో బెర్త్ కష్టమేనని అంటున్నారు. దీనికి ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ప్రధాన కారణంగా చెబుతున్నారు. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్లో దారుణంగా ఫెయిలవడంతో వీళ్లను సెలెక్టర్లతో పాటు బీసీసీఐ పెద్దలు కూడా పట్టించుకోలేదని టాక్ నడుస్తోంది.
ఐపీఎల్-2024లో హార్దిక్ అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అతడు ఇప్పటిదాకా 9 మ్యాచ్‌లు ఆడి 197 పరుగులే చేశాడు. బౌలింగ్‌లోనూ 4 వికెట్లే పడగొట్టాడు. దీంతో ఆల్‌రౌండర్ రోల్ కోసం హార్దిక్‌ను తీసుకుందామనుకున్న సెలెక్టర్లు అతడి ప్లేసులో శివమ్ దూబెను ఖాయం చేశారని వినిపిస్తోంది. మిస్టర్ 360 సూర్యకుమార్ కూడా ఈ సారి లీగ్‌లో ఫెయిలయ్యాడు. 6 మ్యాచుల్లో 166 రన్సే చేశాడు. దీంతో అతడ్ని పక్కనబెట్టాలని బీసీసీఐ పెద్దలు ఫిక్స్ అయ్యారట. ఈ ఐపీఎల్లో 320 పరుగులతో మంచి ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ స్ట్రయిక్ రేట్ అంశం సెలెక్టర్లను తీవ్రంగా నిరాశపర్చిందట. 140 స్ట్రయిక్ రేట్‌తో ఆడుతుండటంతో అతడి బదులు ఇతర యంగ్‌స్టర్స్‌ను ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇంక 8 మ్యాచుల్లో 112 పరుగులతో ఫినిషర్ రోల్‌కు తగిన న్యాయం చేయడంలో రింకూ సింగ్ ఫెయిలయ్యాడు. దీంతో సెలెక్షన్ రాడార్ నుంచి అతడి పేరును కూడా తొలగించారని వినిపిస్తోంది. అయితే వీళ్లు టీమ్‌లో ఉంటారా? ఉండరా? అనేది బోర్డు అధికారిక ప్రకటన చేశాకే తెలుస్తోంది.