MS Dhoni Temples Built Ambati Rayudu: ధోనీకి గుడి కట్టినా తక్కువే.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

MS Dhoni: ధోనీకి గుడి కట్టినా తక్కువే.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి గుడి కట్టినా తక్కువేనని ఓ మాజీ క్రికెటర్ అన్నాడు. అతడు క్రికెట్​కు అందించిన సేవలు అలాంటివి అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు.

లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి గుడి కట్టినా తక్కువేనని ఓ మాజీ క్రికెటర్ అన్నాడు. అతడు క్రికెట్​కు అందించిన సేవలు అలాంటివి అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు.

లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని గురించి స్పెషల్​గా చెప్పాల్సిన పనిలేదు. టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి టీమిండియాకు కెప్టెన్సీ చేసే స్థాయికి ఎదిగాడు. భారత జట్టుకు రెండు వరల్డ్ కప్​లు అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజేతగా నిలిపాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​లోనే కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లోనూ అతడికి ఘనమైన రికార్డులు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్​కు ఏకంగా 5 కప్పులు అందించాడు మాహీ. ఆ టీమ్​ను బిల్డ్ చేశాడు. ఎందరో యంగ్ ప్లేయర్స్​కు ఛాన్సులు ఇచ్చాడు. సీఎస్​కేకు ఆడటం ద్వారా చెన్నై అభిమానులకు మరింత చేరువయ్యాడు. ధోని అంటే అక్కడి ఫ్యాన్స్​కు పిచ్చి. ఇదే విషయాన్ని ఓ మాజీ క్రికెటర్ చెబుతున్నాడు.

ధోనీకి గుడి కట్టినా తక్కువేనని మాజీ బ్యాటర్ అంబటి రాయుడు అన్నాడు. చెన్నై ఫ్రాంచైజీకి అతడు అందించిన సేవలు, ఫ్యాన్స్​ను అతడు అలరించిన విధానానికి టెంపుల్ కట్టాల్సిందేనని చెప్పాడు. ‘ధోనీని చెన్నై ఫ్యాన్స్ దేవుడిగా కొలుస్తారు. ఒక విషయం కాన్ఫిడెంట్​గా చెప్పగలను. రాబోయే రోజుల్లో చెన్నైలో ధోనీకి గుడి కట్టడం పక్కా. భారత్​కు అతడు రెండు వరల్డ్ కప్స్ అందించాడు. ఐపీఎల్​లో చెన్నైని కూడా ఐదు సార్లు ఛాంపియన్స్​గా నిలిపాడు. ఛాంపియన్స్ లీగ్​లోనూ జట్టును విజేతగా నిలబెట్టాడు’ అంటూ రాయుడు ప్రశంసల్లో ముంచెత్తాడు. ఇక, ధోని-రాయుడు కలసి సీఎస్​కే తరఫున ఎన్నో మ్యాచుల్లో ఆడారు.

ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ పేరు సంపాదించిన రాయుడు.. ఆ తర్వాత సీఎస్​కేకు మారాడు. ఎన్నో మ్యాచుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్​లతో చెన్నైకి విజయాలను అందించాడు. అలాంటోడు గతేడాది ఐపీఎల్ ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నాడు. అప్పటి నుంచి క్రికెట్ వ్యవహారాలకు దూరంగా వస్తున్నాడు. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్​లో కామెంట్రీతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అవకాశం దొరికినప్పుడు టీమిండియాతో తన జర్నీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్​లో ఆడిన రోజుల గురించి కూడా ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. మరి.. ధోనీకి గుడి కట్టాలంటూ రాయుడు చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments