17 ఏళ్లుగా కప్పులేకపోయినా.. RCB అంటే ఇందుకే కదా పడిచచ్చేది!

17 ఏళ్లుగా కప్పులేకపోయినా.. RCB అంటే ఇందుకే కదా పడిచచ్చేది!

Mohammed Siraj, Venkatesh Iyer: ఐపీఎల్‌ 2024లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ చేసిన ఓ పనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Mohammed Siraj, Venkatesh Iyer: ఐపీఎల్‌ 2024లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ చేసిన ఓ పనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లోని పది టీమ్స్‌లో అందరికంటే ఎక్కువ క్రేజ్‌ ఉన్న టీమ్‌ ఆర్సీబీ. విరాట్‌ కోహ్లీ వల్ల ఆ టీమ్‌కు అంత క్రేజ్‌ వచ్చింది. అయితే.. క్రేజ్‌ విషయంలో నంబర్‌ వన్‌గా ఉన్న ఆ టీమ్‌ ఖాతాలో ఒక్కటంటే ఒక్క ఐపీఎల్‌ ట్రోఫీ కూడా లేదు. అదే ఆర్సీబీకి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కూడా ఆర్సీబీ పరిస్థితి అంతగా బాలేదు. విరాట్‌ కోహ్లీ, దినేష్‌ కార్తీక్‌ మినహా ఆ టీమ్‌ ఏ ఒక్కరు ఫామ్‌లో లేరు. బౌలింగ్‌ విభాగం అయితే మరీ దారుణంగా ఉంది. ఇలాంటి బౌలింగ్‌ ఎటాక్‌తో ఈ ఏడాది కప్పు కొట్టడం కష్టమే అని ఇప్పటికే ఆర్సీబీ అభిమానులు కూడా ఫిక్స్‌ అయిపోయారు. శుక్రవారం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్తగా ఓడిపోవడం కూడా ఆర్సీబీని మరింత కుంగదీసింది.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్సీబీ అభిమానులు కాలర్‌ ఎగరేసి.. ఇందుకే తాము ఆర్సీబీ అంటే పడిచచ్చేది అంటూ చెప్పుకునేలా ఒక ఫొటో వైరల్‌ అవుతుంది. ఆ ఫొటోలో ఆర్సీబీ స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌, కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ షూ లేసులు కట్టాడు. అలా కట్టే ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సాధారణంగా సిరాజ్‌ చాలా అగ్రెసివ్‌ పర్సన్‌. అగ్రెషన్‌లో విరాట్‌ కోహ్లీకి వారసుడిగా పేరుతెచ్చుకున్న సిరాజ్‌.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తన ప్రదర్శన బాగాలేకపోయినా, మ్యాచ్‌ ఓడిపోతున్నా.. తన ఈగోను పక్కనపెట్టి మరీ అయ్యర్‌ షూ లేసులు కట్టాడు. ఈ విషయంలో సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అయితే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ దారుణంగా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన డుప్లెసిస్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అందులో విరాట్‌ కోహ్లీ ఒక్కడే 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 83 పరుగులు చేసి రాణించాడు. కామెరున్‌ గ్రీన్‌ 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 33 రన్స్‌ చేసి పర్వాలేదనిపించాడు. అయితే.. డుప్లెసిస్‌, రజత్‌ పాటిదార్‌, అనుజ్‌ రావత్‌ దారుణంగా విఫలం అయ్యారు. మ్యాక్స్‌వెల్‌ 28 రన్స్‌ చేసినా.. తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. 183 పరుగులు టార్గెట్‌ను కేకేఆర్‌ కేవలం 16.5 ఓవర్లోనే ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌ 3 ఓవర్లలో 46, యశ్‌ దయాళ్‌ 4 ఓవర్లలో 46, అల్జారీ జోసెఫ్‌ 2 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నారు. ఇంత దారుణమైన ఓటమి పొందుతూ కూడా సిరాజ్‌ ఈగో, కోపం చూపించకుండా వెంకటేశ్‌ అయ్యర్‌ షూలేసులు కట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments