KKRకు గుడ్ న్యూస్.. ప్లేఆఫ్స్​కు ముందు అనుకున్నది సాధించింది!

కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్​కు గుడ్ న్యూస్. లక్నోపై ఘన విజయంతో ఫుల్ జోష్​లో ఉన్న కేకేఆర్.. ప్లేఆఫ్స్​కు ముందు ఏం అనుకుందో అది సాధించింది.

కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్​కు గుడ్ న్యూస్. లక్నోపై ఘన విజయంతో ఫుల్ జోష్​లో ఉన్న కేకేఆర్.. ప్లేఆఫ్స్​కు ముందు ఏం అనుకుందో అది సాధించింది.

ఈ ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్​ జోరును ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. ఆ టీమ్, ఈ టీమ్ అనే తేడాల్లేకుండా ఎదురొచ్చిన ప్రతి జట్టును ఓడిస్తూ దూసుకుపోతోంది అయ్యర్ సేన. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జియాంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి స్ట్రాంగ్ టీమ్స్​ను వాళ్ల హోమ్ గ్రౌండ్స్​లో చిత్తు చేసింది కేకేఆర్. ఈసారి అన్ని జట్ల కంటే కూడా ఐపీఎల్​లో మోస్ట్ డామినెంట్ టీమ్​గా కోల్​కతా నిలిచింది. నిన్న లక్నో జట్టును వాళ్ల సొంతగడ్డ మీద 98 పరుగుల భారీ తేడాతో ఓడించింది కోల్​కతా. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్​లో టాప్ పొజిషన్​కు చేరుకుంది. ఈ తరుణంలో ఆ టీమ్​కు ఓ గుడ్ న్యూస్.

ప్లేఆఫ్స్​కు ముందు తాను అనుకున్నది సాధించింది కేకేఆర్. ఆ టీమ్​ విజయాల్లో కీలకంగా మారాడు ఓపెనర్ ఫిల్ సాల్ట్. ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో కలిపి 429 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ లిస్ట్​లో ఐదో స్థానంలో ఉన్న సాల్ట్.. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 183గా ఉంది. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఎంత విధ్వంసకరంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మరో ఓపెనర్ సునీల్ నరైన్​తో కలసి పవర్​ప్లేలో భారీగా పరుగులు చేస్తున్నాడు సాల్ట్. అదిరిపోయే స్టార్ట్స్ అందిస్తూ కేకేఆర్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అలాంటోడు ప్లేఆఫ్స్​కు దూరమవుతాడని అంతా భావించారు. దీనికి కారణం స్వదేశంలో పాకిస్థాన్​తో టీ20 సిరీస్​కు అతడు సెలెక్ట్ అవడమే. అయితే అతడి విషయంలో కేకేఆర్ పంతం నెగ్గించుకుంది.

వచ్చే నెల మొదటి తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలవనున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని దేశాలు ఇప్పటికే తమ ప్రపంచ కప్ స్క్వాడ్స్​ను కూడా అనౌన్స్ చేశాయి. ఇంగ్లండ్ కూడా తమ టీమ్​ను ప్రకటించింది. అదే సమయంలో ఐపీఎల్​లో ఆడుతున్న తమ ప్లేయర్లను స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. పొట్టి కప్​కు ముందు పాక్​తో టీ20 సిరీస్ ఉండటంతో ఆటగాళ్లను రప్పించడంపై ఫోకస్ చేస్తోంది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలు మాత్రం ఇంగ్లండ్ ప్లేయర్లు ఎలాగైనా టోర్నీలో కంటిన్యూ అయ్యేలా చూడాలంటూ బీసీసీఐ మీద ప్రెజర్ తీసుకొచ్చాయి. ఇంగ్లీష్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ తమ టీమ్​లో ముఖ్యం కావడంతో కేకేఆర్ కూడా బోర్డుపై ఒత్తిడి పెట్టింది. ఇది వర్కౌట్ అయిందని తెలుస్తోంది. పాక్​తో తొలి రెండు టీ20లకు ఐపీఎల్ ప్లేయర్లు అందుబాటులో ఉండరని, అందుకు ఒప్పుకోవాలంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ చర్చలు సాగిస్తోందని సమాచారం. ఇక, ఐపీఎల్​లో సాల్ట్​తో పాటు జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), మొయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), విల్ జాక్స్, రీస్ టోప్లే (ఆర్సీబీ), లివింగ్​స్టన్, సామ్ కర్రన్, బెయిర్​స్టో (పంజాబ్ కింగ్స్) కూడా ఆడుతున్నారు.

Show comments