RCB రికార్డును మూడోసారి బ్రేక్ చేసిన SRH.. ఇదీ ఆరెంజ్ ఆర్మీ పవర్!

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డులకు రీడెఫినిషన్ చెబుతోంది. ఈ ఐపీఎల్ సీజన్​లో బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తున్న ఆరెంజ్ ఆర్మీ.. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో ఎన్నో అరుదైన ఘనతలను సాధించింది.

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డులకు రీడెఫినిషన్ చెబుతోంది. ఈ ఐపీఎల్ సీజన్​లో బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తున్న ఆరెంజ్ ఆర్మీ.. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో ఎన్నో అరుదైన ఘనతలను సాధించింది.

ఏదైనా జట్టు ఒక రికార్డును బ్రేక్ చేసినా లేదా అరుదైన ఘనత సాధించినా గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది ఒకే మ్యాచ్​లో ఎన్నో పాత రికార్డులను బద్దలుకొడితే ఏమనాలి. ఇప్పుడు సన్​రైజర్స్ హైదరాబాద్​ను ఎంత పొగిడినా తక్కువే. నెవర్ బిఫోర్ రేంజ్​లో ఆడుతూ ఆడియెన్స్​ను ఉర్రూతలూగిస్తోంది ఆ టీమ్. గత కొన్ని సీజన్లుగా చెత్తాటతో తీవ్రంగా నిరాశపర్చిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి గేమ్​ను కంప్లీట్​గా మార్చేసింది. విధ్వంసక బ్యాటింగ్​తో ప్రత్యర్థులను వణికిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. నీళ్లు తాగినంత సులువుగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లోనూ ఇదే రిపీట్ చేసింది ఎస్​ఆర్​హెచ్. ఆర్సీబీ రికార్డును బద్దలుకొట్టింది కమిన్స్ సేన.

ఆర్సీబీ హయ్యెస్ట్ స్కోర్ రికార్డు (263 పరుగులు)ను ముచ్చటగా మూడోసారి బ్రేక్ చేసింది సన్​రైజర్స్. ఒకే సీజన్​లో బెంగళూరు స్కోరును మూడుసార్లు బద్దలుకొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్​లో తొలుత ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో 277 పరుగులు చేసింది ఆరెంజ్ ఆర్మీ. ఆ తర్వాత ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోరు 287ను ఆర్సీబీతో మ్యాచ్​లో నమోదు చేసింది. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ మీద 266 పరుగులు చేసింది. టీ20ల్లో 250 కొడితే చాలా గొప్ప. అలాంటిది ఒకే సీజన్​లో ఆ స్కోర్​ను మూడుసార్లు బీట్ చేయడం అంటే మాటలు కాదు. దీంతో ఎస్​ఆర్​హెచ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇది సన్​రైజర్స్ తడాఖా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, డీసీతో మ్యాచ్​లో అన్ని ఓవర్లు ఆడి 7 వికెట్లకు ఎస్​ఆర్​హెచ్ 266 పరుగులు చేసింది. ఛేజింగ్​కు దిగిన పంత్ సేన ప్రస్తుతం 4.1 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 66 పరుగులతో ఉంది.

Show comments