SRH Nitish Kumar Reddy Wins Emerging Player Award: IPL వేదికపై తెలుగోడికి అరుదైన గౌరవం.. నితీష్ రెడ్డి ప్రతిభకు గుర్తింపు!

IPL వేదికపై తెలుగోడికి అరుదైన గౌరవం.. నితీష్ రెడ్డి ప్రతిభకు గుర్తింపు!

ఐపీఎల్ వేదికపై తెలుగోడికి అరుదైన గౌరవం దక్కింది. సన్​రైజర్స్ హైదరాబాద్​ యంగ్ గన్ నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభకు గుర్తింపు లభించింది.

ఐపీఎల్ వేదికపై తెలుగోడికి అరుదైన గౌరవం దక్కింది. సన్​రైజర్స్ హైదరాబాద్​ యంగ్ గన్ నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభకు గుర్తింపు లభించింది.

గత కొన్ని సీజన్లుగా నిరాశపరుస్తూ వచ్చింది సన్​రైజర్స్ హైదరాబాద్. గెలవడమే మర్చిపోయినట్లు ఆడుతూ పాయింట్స్ టేబుల్​లో ఆఖర్లో నిలవడం అలవాటుగా చేసుకుంది. దీంతో సొంత అభిమానుల నుంచి కూడా ఆరెంజ్ ఆర్మీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ జట్టు పనైపోయిందని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే పడి లేచిన కెరటంలా ఈ సీజన్​లో దూసుకొచ్చింది. భారీ విజయాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ఎస్​ఆర్​హెచ్​. లీగ్ దశ ముగిసేసరికి టాప్​-2లో నిలిచింది. ప్లేఆఫ్స్​ తొలి మ్యాచ్​లో ఓడినా క్వాలిఫైయర్-2లో గెలిచి ఫైనల్స్​లోకి అడుగుపెట్టింది. దీంతో కప్పు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సన్​రైజర్స్ ఫ్యాన్స్​కు మరోసారి నిరాశే మిగిలింది. ఐపీఎల్-2024 తుదిపోరులో కేకేఆర్ చేతుల్లో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది కమిన్స్ సేన.

సండే ఫైట్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్​హెచ్ 18.3 ఓవర్లలో కుప్పకూలింది. ఆ తర్వాత ఛేజింగ్ స్టార్ట్ చేసిన అయ్యర్ సేన 10.3 ఓవర్లలోనే టార్గెట్​ను అందుకొని సంబురాల్లో మునిగిపోయింది. అయితే కప్పు మిస్సైనా సన్​రైజర్స్ అభిమానులకు ఓ విషయం ఊరటను కలిగించింది. ఈ సీజన్ మొత్తం అద్భుతమైన బ్యాటింగ్, క్వాలిటీ బౌలింగ్​తో అదరగొట్టిన యంగ్ గన్ నితీష్ కుమార్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఈ తెలుగోడు ఎంపికయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​లో చూపిన అసమాన ప్రదర్శనకు గానూ ఈ అవార్డును అతడికి బహూకరించారు. మ్యాచ్ తర్వాత నితీష్​కు ఈ పురస్కారాన్ని ఇస్తున్న టైమ్​లో స్టేడియంలోని ఫ్యాన్స్ చప్పట్లతో అతడ్ని అభినందించారు.

ఈ సీజన్​లో తనలోని టాలెంట్​ను వరల్డ్ క్రికెట్​కు పరిచయం చేశాడు నితీష్​ రెడ్డి. 13 మ్యాచుల్లో 142 స్ట్రైక్ రేట్​తో 303 పరుగులు చేశాడు. మిడిల్ ఓవర్స్​లో క్రీజులోకి వచ్చి అటు వికెట్లను కాపాడటంతో పాటు ఇటు స్కోరు బోర్డును కూడా పరిగెత్తిస్తూ సన్​రైజర్స్ విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు నితీష్​. బ్యాట్​తోనే గాక కమిన్స్ చేతికి బాల్ ఇచ్చిన ప్రతిసారి పేస్ బౌలింగ్​తో వికెట్లు కూడా తీస్తూ తనపై టీమ్ మేనేజ్​మెంట్​కు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గ్రౌండ్​ ఫీల్డింగ్​లో రన్స్ లీక్ కాకుండా చూసుకున్నాడు. అదే టైమ్​లో బౌండరీ లైన్ వద్ద సూపర్బ్ క్యాచ్​లు అందుకున్నాడు. అందుకే టోర్నీలో చాలా మంది యంగ్​స్టర్స్ రాణించినా.. నితీష్ రెడ్డినే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు వరించింది. మరి.. నితీష్ ఆటతీరుపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments