Nidhan
ఆర్సీబీ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డును క్రియేట్ చేశాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఆర్సీబీ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డును క్రియేట్ చేశాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.
Nidhan
ఐపీఎల్-2024లో భీకర ఫామ్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఎలాగైనా ఆర్సీబీకి కప్పు అందించాలని పట్టుదలతో ఉన్న కింగ్.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లోనూ తన బ్యాట్‌తో గర్జిస్తున్నాడు. సాధారణ మ్యాచుల్లోనే అంత భీకరంగా ఆడిన కోహ్లీ.. ఇంక ప్లేఆఫ్స్‌కు చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ఊరుకుంటాడా? చెన్నైతో జరుగుతున్న నాకౌట్ మ్యాచ్‌లో కింగ్ జూలు విదిల్చాడు. 9 బంతుల్లో 1 బౌండరీ, 2 సిక్సులతో 19 పరుగులు చేశాడు. ఇంకా క్రీజులోనే ఉన్న ఆర్సీబీ స్టార్.. ఈ మ్యాచ్‌లో క్రేజీ రికార్డును క్రియేట్ చేశాడు.
రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. సీఎస్కే మ్యాచ్‌తో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌తో చిన్నస్వామి స్టేడియంలో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్. ఐపీఎల్ హిస్టరీలో ఒక వెన్యూలో 3 వేలు ప్లస్ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కింగ్ నిలిచాడు. ఇప్పటిదాకా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇలా ఒకే వేదికలో ఇన్ని పరుగులు చేయలేదు. మరి.. కోహ్లీ అరుదైన ఘనతపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
VIRAT KOHLI BECOMES THE FIRST PLAYER IN IPL HISTORY TO SCORE 3000+ RUNS IN A SINGLE VENUE 🤯 pic.twitter.com/4vslJ8UO2B
— Johns. (@CricCrazyJohns) May 18, 2024