విద్యార్థినులకు సంతూర్ గుడ్ న్యూస్.. ఏకంగా 24 వేల స్కాలర్‌షిప్.. ఇలా పొందండి

Santoor Scholarship Program 2024-25: విద్యార్థినులకు గుడ్ న్యూస్. సంతూర్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం 2024-25 ద్వారా ఏడాదికి ఏకంగా 24 వేల స్కాలర్ షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్ షిప్ కు ఎవరు అర్హులు అంటే?

Santoor Scholarship Program 2024-25: విద్యార్థినులకు గుడ్ న్యూస్. సంతూర్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం 2024-25 ద్వారా ఏడాదికి ఏకంగా 24 వేల స్కాలర్ షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్ షిప్ కు ఎవరు అర్హులు అంటే?

ప్రతిభ ఉండి లక్ష్మీ కటాక్షం లేక ఎంతో మంది చదువుకు దూరమవుతున్నారు. ఎంతో భవిష్యత్ ఉండి కూడా డబ్బులేని కారణంగా చదువుకోవాలనే ఆశలను చంపేసుకుంటున్నారు. చదువు మానేసి ఏవో చిన్నాచితక పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇలాంటి వారికి ఆర్థిక చేయూతనందిస్తూ విద్య వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు, కార్పోరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. అర్హులైన పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నాయి. ఈ క్రమంలో విప్రో సంస్థ సంతూర్ విద్యార్థినులకు తీపి కబురును అందించింది. వారికి స్కాలర్ షిప్స్ అందించేందుకు రెడీ అవుతోంది. సంతూర్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం 2024-25 ద్వారా స్కాలర్ షిప్స్ అందిస్తోంది. ఈ స్కాలర్ షిప్ కు ఇంటర్ పూర్తి చేసిన బాలికలు అర్హులు.

సంతూర్ అందించే స్కాలర్ షిప్ పొందేందుకు విద్యార్థినులు టెన్త్, ఇంటర్ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోనే చదివి ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పేద బాలికలే ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. 2023-24 అకాడమిక్ ఇయర్ లో ఇంటర్ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన వారై ఉండాలి. 2024-25లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి. ఎంపికైన వారికి మూడేళ్లు లేదా కోర్స్ పూర్తైనంత వరకు ప్రతి నెల రూ. 2 వేల చొప్పున అంటే సంవత్సరానికి 24 వేల స్కాలర్ షిప్ అందిస్తారు.

అప్లికేషన్ ఫాం ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పూర్తి వివరాలను ఫిల్ చేసి పోస్టు ద్వారా విప్రో కేర్స్-సంతూర్ స్కాలర్ షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్ రోడ్డు, బెంగళూరు, కర్ణాటక చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. అర్హత, ఆసక్తి గలవారు సెప్టెంబర్ 20వరకు అప్లై చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థినులను చదువు వైపు ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్ షిప్స్ అందిస్తున్నట్లు విప్రో తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments