కేంద్ర ప్రభుత్వ పథకం.. విద్యార్థులకు రూ. 2 లక్షలు! మీరు దక్కించుకోవచ్చు!

విద్యార్థి దశ చాలా అందమైనది. చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా ఈ దశ చాలా మందికి న్యాయ నిర్ణేతగా మారుతుంది. అయితే చదువుతో పాటు స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. ఈ స్కిల్స్ పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకు వచ్చింది.

విద్యార్థి దశ చాలా అందమైనది. చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా ఈ దశ చాలా మందికి న్యాయ నిర్ణేతగా మారుతుంది. అయితే చదువుతో పాటు స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. ఈ స్కిల్స్ పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకు వచ్చింది.

మనిషి జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకం. చదువుకోవాలన్నా, ఆడుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా, స్నేహితులు, సరదాలు అన్నీ కూడా విద్యార్థి దశలో ముఖ్యమైన అంశాలు. విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. మార్కులు కేవలం కొలమానం మాత్రమే కానీ.. స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలు రావు. టెక్నీకల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అయితే వీటిని కూడా డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఓ చక్కని పథకాన్ని తీసుకు వచ్చింది. ఇందులో స్కిల్స్ పెంచుకోవచ్చు. ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు. అందుకు తగిన ఆర్థిక సాయం అందిస్తోంది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)

అంతర్జాతీయ స్థాయిలో తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకున్నా, నాల్జెడ్ పెంపొందించుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఏఐసీటీఈ సపోర్ట్ స్టూడెంట్స్ ఫర్ పార్టిసీపేటింగ్ ఇన్ కాంపిటిషన్స్ ఎబ్రాడ్ (ఎస్ఎస్పీసీ) స్కీం తీసుకువచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఏ కాంపీటీషన్స్ లో పాల్గొనే విద్యార్థులకు ఈ పథకం ద్వారా డబ్బులు చెల్లిస్తోంది ఏఐసీటీఈ. ఒక్కో విద్యార్థికి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ పథకానికి ఎవరు అర్హులంటే.. ఏఐసీటీఈ ఆమోదించి యూనివర్శిటీల్లో డిప్లామా, బీఈ/బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంబీఏ, హోటల్ మేనేజ్ మెంట్ చదివే విద్యార్థులు మాత్రమే. అయితే ఒక్కో విద్యార్థికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది.

విదేశీ కాంపీటీషన్లలో పాల్గొనే ముందు.. దేశీయంగా అలాంటి కాంపీటీషన్లలో పాల్గొని విజయాన్ని సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ఇక విదేశాల్లో కాంపిటీషన్ గడువు కూడా పది రోజుల లోపు ఉంటేనే ఈ 2 లక్షల ఆర్థిక సాయానికి అర్హులుగా పరిగణిస్తారు. ఈ డబ్బులు కూడా ముందుగా ఇవ్వరు. రీఎంబర్స్ మెంట్ రూపంలో చెల్లిస్తారు. ఈ ఆర్థిక సాయంతో ట్రావెలింగ్, విదేశాల్లో పోటీలో పాల్గొనచ్చు. విద్యార్థికి మెంటరింగ్, లాజిస్టికల్ సలహాలు ఇస్తారు. విద్యార్థికి ఇచ్చే నగదులోనే దేశీ, అంతర్జాతీయ ట్రావెల్ ఖర్చులు, రిజిస్ట్రేషన్ ఫీజు, వీసా అప్లికేషన్ ఫీజు, లాడ్జి ఖర్చులు, ఎయిర్ పోర్ట్ ఛార్జీలు, ట్రావెల్ హెల్త్ ఇన్సురెన్స్, ఇతర ఖర్చులు చెల్లిస్తారు. కామన్ స్టూడెంట్స్ ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఆర్థిక సాయానికి మీ వంతు కృషి చేయండిక.

Show comments