P Krishna
Sharan Navaratri 2024: దేశ వ్యాప్తంగా మిందువులు శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పట్టణాలు, పల్లెలు దేవీ నవరాత్రుల కోసం మండపాలు అందంగా ముస్తాబవుతున్నాయి. ఈ ఏడాది నవరాత్రులు ఏకంగా పదిరోజులు జరుపుకోబోతున్నట్లు తెలుస్తుంది.
Sharan Navaratri 2024: దేశ వ్యాప్తంగా మిందువులు శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పట్టణాలు, పల్లెలు దేవీ నవరాత్రుల కోసం మండపాలు అందంగా ముస్తాబవుతున్నాయి. ఈ ఏడాది నవరాత్రులు ఏకంగా పదిరోజులు జరుపుకోబోతున్నట్లు తెలుస్తుంది.
P Krishna
భారత దేశంలో హిందూమత విశ్వాసాల ప్రతీకగా ప్రతి సంవత్సరం నాలుగు సార్లు నవరాత్రులు జరుపుకుంటారు. ఇందులో దేవీ నవరాత్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేది నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12 వ తేదీ వరకు కొనసాగుతాయి. సాధారణంగా నవరాత్రుల్లో మొదటి రోజున శని దేవుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ పవిత్రమైన సమయంలో అమ్మవారిని తొమ్మిదిరోజులు ప్రత్యేక రూపాలతో అలంకరించి పూజిస్తుంటారు. ఈసారి నవరాత్రి ఉత్సవాలను 10 రోజుల పాటు జరుపుకోనున్నారు. ఈ ఏడాది నవరాత్రులు 9 రోజులు కాకుండా 10 రోజులు ఎందుకు జరపుకుంటారు.. కారణం ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
ఈ ఏడాది పితృ ముగియనుంది. వెంటనే శరన్నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. అమ్మవారి పేరుతో ఉపవాసం ఉంటారు. హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రశాస్త్యం ఉంది.నవరాత్రి వేళ దుర్గాదేవి అనుగ్రహం కలగాలంటే ఎలాంటి వాటిని ఆచరించాలి.. ఈ ఏడాది 9 రోజులు కాకుండా 10 రోజులు ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నాన్న విషయం గురించి తెలుసుకుందాం. నవరాత్రులు ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నుంచి ప్రారంభమవుతాయి. నవరాత్రులు 11 అక్టోబర్ 2024 వరకు కొనసాగనున్నాయి. విజయదశమి పండుగ అక్టోబర్ 12న జరుపుకుంటారు. ఈ 9 తొమ్మిది రోజులు దుర్గాదేవిని శైలపుత్రి, బ్రహ్మచారిని, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్దిదాత్రిగా తొమ్మిది రూపాలతో పూజిస్తుంటారు. ఈ నవరాత్రులు భక్తులు ఉపవాసం ఉంటారు.
నవరాత్రులలో దుర్గాదేవిని మహాశక్తికి ప్రతీకగా భావించి పూజిస్తుంటారు. అమ్మవారిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయని జీవితంలో బలం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఈ ఏడాది ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం ప్రతిపాద తేది అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12:19 గంటలకు మొదలవుతుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 4 మధ్యాహ్నం 2:58 గంటలకు ముగుస్తుంది. అయితే కొన్ని పంచాగాల ప్రకారం మాత్రం అష్టమి.. నవమి తిథి రెండూ అక్టోబర్ 11నే వచ్చినట్లు చెబుతున్నారు పండితులు. అయితే నవమి తిథి పూజకు అనుకూలమైన సమయం అని అక్టోబర్ 12వ తేదీ దసరా పండుగ ఉదయం తిధిలో జరుపుకుంటారు కాబట్టి ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు కాకుండా 10 రోజులు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు.
గమనిక : ఈ సమాచారం నిజం, ఖచ్చితమైనదని మేం ధృవీకరించలేం.. వీటిని పాటించే ముందు పండితుల సలహా తీసుకోవడం మంచింది.