కర్ణుడి చావుకి 10 కారణాలు అంటారు.. ఆయన చేసిన తప్పేంటే?

Karna Story: మహాభారతంలోని ప్రధానమైనవారిలో కర్ణుడు ఒకరు. ఈయనకు ఎంత గొప్ప పేరు ఉందో.. అందుకు భిన్నంగా ఆయన జీవితంలో ఎన్నో శాపలకు గురవుతాడు. అందుకే కర్ణుడి చావుకు అనేక కారణాలు అంటారు. మరి.. అసలు ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Karna Story: మహాభారతంలోని ప్రధానమైనవారిలో కర్ణుడు ఒకరు. ఈయనకు ఎంత గొప్ప పేరు ఉందో.. అందుకు భిన్నంగా ఆయన జీవితంలో ఎన్నో శాపలకు గురవుతాడు. అందుకే కర్ణుడి చావుకు అనేక కారణాలు అంటారు. మరి.. అసలు ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కల్కి మేనిమా నడుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్దు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌తో దుమ్ములేపుతుంది. మైథలాజికల్ స్టోరీకి సైన్స్ ఫిక్షన్ జోడించి విజువల్ వండర్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో ఓ కళాఖండాన్ని చెక్కి.. ఆడియన్స్ కి అందించాడు.  ఇలా కల్కి సినిమా సూపర్ హిట్ అవ్వడానికి చాలానే కారణాలు ఉన్నా.. ఈ రేంజ్ రెస్పాన్స్ రావడానికి మాత్రం మహాభారతం సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అందరికి కర్ణుడు గురించి తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది. మహాభారతంలో కర్ణుడు చేసిన తప్పేమిటి, కర్ణుడి చావుకు 10 కారణాలు అంటారు..ఎందుకు?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

హిందూపురాణ గాథాల్లో ప్రముఖమైన వాటిల్లో మహాభారతం ఒకటి. మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే విషయాలను ఈ మహాభారతం చక్కగా తెలియజేస్తుంది. ఈ ఇతిహాసలో ప్రధానమైన వారిలో కర్ణుడు ఒకరు. ఈయను దానవీర శూర కర్ణుడు అని పిలుస్తుంటారు. దానాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ముందుక ఎవరు కూడా పనికారు.  అంతటి గొప్ప..కేవలం తనలో మెదిలన ఓ మనోవేదన కారణంగా.. అనేక మంది శాపలకు గురై..చివరకు తన తమ్ముడైన అర్జునుడి చేతిలోనే మరణిస్తాడు.

సమాజం తనకు శూద్రుడు అంటూ పిలిస్తుంటే.. ఎంతో కోపంతో రగిపోయే వాడు కర్ణుడు. అలాంటి సమయంలో ఆయన బలహీనతను దుర్యోధనుడు గ్రహించి.. తన వైపు తిప్పుకుంటాడు. చివరకు వారిపై వైపు ఉండి కర్ణుడు అనేక తప్పులు చేశాడు. వివిధ కారణాలతో తన గురువు పరశురాముడి శాపానికి గురవుతాడు. అలానే ఓ బ్రాహ్మణుడి ఆవు దూడకు బాణం తగిలి చనిపోతుంది. దీంతో ఆయన కూడా కర్ణుడిని శపిస్తాడు. యుద్ధం వేళ నీ రథ చక్రం గోతిలో కూరుకుపోయి..ప్రాణంతకమైన భయంకి గురవుతావని ఆ బ్రాహ్ముడు శపించాడు. ఇలా కర్ణడుకు రకరకాలుగా అనేక మంది వ్యక్తుల చేత శాపాలకు గురవుతాడు. ఇలా  అనేక శాపలకు కర్ణుడు గురవుతాడు. అందుకే కర్ణుడి చావుకు 10 కారణాలు అంటారు.

ఇక కర్ణుడు అనగానే గుర్తుకు వచ్చింది.. దానం. ఓ సారి దేవేంద్రుడు పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలని కోరాడు. ఈ విషయం ముందే గ్రహించిన సూర్యుడు.. తన కుమారుడికి కీలక విషయాలు చెబుతాడు. దేవేంద్రుడు బ్రహ్మణుడి రూపంలో వచ్చి.. నీ కవచ కుండలాను అడుగుతాడని ఇవ్వొద్దని సూర్యుడు కర్ణుడితో చెబుతాడు. అయితే సహజ సిద్ధంగానే దాన స్వభావం కలిగిన కర్ణుడు.. తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసి కూడా తన కవచ కుండలాలను కోసి దానంగా ఇచ్చాడు.

కర్ణుడి దాన గుణానికి మెచ్చి.. కృష్ణుడు ఓ వరం కోరుకోమన్నాడు. ‘కృష్ణా..! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం.. అంతే కాదు నీచం కూడ. అందుకే ఏ  జన్మలోను దేహి నాస్తి అనే మాటలు నా నోటి వెంట రాకుండా అనుగ్రహించు’ అని కర్ణుడు కోరాడు. ఇలా కర్ణుడు తన దాన ధర్మాలతో దానకర్ణుడు అయ్యాడు. ఇలా  ఎంత మంచి పేరు సంపాదించుకున్న కర్ణుడు.. చివరకు తన సొంత తమ్ముడి చేతిలో మరణిస్తాడు.

హస్తకళ ప్రదర్శనలో కర్ణుడిని చూసిన దుర్యోధనుడు.. అతడిని తన వద్ద పెట్టుకుంటే పాండవులను ఓడించవచ్చని భావించాడు. అందుకే ముందుగా తన రాజ్యాన్ని బహుమతిగా ఇస్తూ వల వేసి.. కర్ణుడిని తన వైపు తిప్పుకున్నాడు. అదే విధంగా కర్ణుడికి కూడా రాజు అవ్వాలనే కోరిక ఉండటంతో తాను కూడా ఉచ్ఛనీఛాలను చూడకుండా కర్ణుడు అధర్మవైపు నిలబడతాడు. అలా కర్ణుడు దుర్యోధనుడి పక్షాన్నా ఉంటూ అనే తప్పులు చేయడం ప్రారంభిస్తాడు. కర్ణుడు ఎంత ఉన్నత స్థితి చేరినా కూడా ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తితో ఉండేవాడు.

ఎందుకంటే.. తనపై శూద్రుడు అనే ముద్ర వేయడాన్ని తట్టుకోలేపోయాడు. గొప్ప వాడు కావాలనే ఆశతో ఉంటుంటే.. ఇదే సమయంలో ఆయన ఎక్కడికి వెళ్లిన శూద్రుడు అని అంటుండేవారు. అందుకే ఆయన జీవితం మొత్తం ఈ మాటతోనే బాధ పడే వాడు. ఆయనలోని ఈ వేదనే మహాభారతంలో అందరి కంటే గొప్ప వ్యక్తిగా ఉన్న కర్ణుడిని నీచమైన పాత్రగా తయారు చేసింది. ఆయన దాన గుణంతో ఎంతో ఔన్యత్యం ప్రదర్శించి.. కానీ కర్ణుడికి ఉన్న బాధ అనేది సమాజంపై ఆయనకు పగలా మారింది. అందుకే అనేక సందర్భాల్లో తన జీవితాన్ని ఆయనే చేతులారా.. తారుమారు చేసుకున్నారు.

ఒక ధర్మం మరొక ధర్మంతో వ్యతిరేకించేలా ప్రవర్తిస్తే.. ముందు చెప్పుకున్న ధర్మాలు అన్నీ వ్యర్థం అవుతాయి. అదే విధంగా కర్ణుడు ..దుర్యోధన, దుశ్యాసన, శకునిలతో కలిసి మాయని మచ్చలు తెచ్చుకున్నాడు. అందుకే కర్ణుడికి గురువు శాపం, బ్రాహ్మణుడి, బుషి మొదలైన వారి శాపం తగిలాయి. చెడువైపు నిలబడటమే ఆయన చేసిన తప్పుగా పురాణాలు చెబుతున్నాయి. అయితే కర్ణుడు తన కర్మను బలంగా నమ్మాడు. అందుకే తన జీవితాన్ని  ధైర్యంగా అస్వాధించాడు. కర్ణుడు కురుక్షేత్రంలో 17వ రోజు అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణించాడు. తన దగ్గర ఉన్న అస్త్రాలు, వరాలు అన్ని మర్చిపోయి…రథ చక్రాలు భూమిలో ఇరుక్కుపోయిన తరువాత అర్జునుడి బాణానికి బలయ్యాడు.  మనం ఎలా పుట్టినా, ఎలా పెరిగిన ధర్మం వైపు నడిస్తే.. ఆ ధర్మమే మనల్ని గెలిపిస్తుందని మహాభారతం చెబుతుంది.

Show comments