Ganesh Chaturthi 2024 Date: వినాయక చవితి పండుగ తేదీ, ముహూర్తం, చేయాల్సిన విధి విధానాలు

Ganesh Chaturthi 2024 Date: హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పర్వదినాల్లో వినాయక చవితి పండుగ ఒకటి. మరి ఈ వినాయక చవితి ఈ ఏడాది ఏ తేదీన వచ్చింది? పూజకు శుభ ముహూర్తం ఎప్పుడు? వినాయక చవితి రోజున చేయాల్సిన విధి విధానాలు ఏంటి?

Ganesh Chaturthi 2024 Date: హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పర్వదినాల్లో వినాయక చవితి పండుగ ఒకటి. మరి ఈ వినాయక చవితి ఈ ఏడాది ఏ తేదీన వచ్చింది? పూజకు శుభ ముహూర్తం ఎప్పుడు? వినాయక చవితి రోజున చేయాల్సిన విధి విధానాలు ఏంటి?

హిందువులు ఎంతో విశిష్టంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టం అందించే దేవుడిగా వినాయకుడు పూజించబడుతున్నాడు. విఘ్నాలు తొలగించే దేవుడిగా కీర్తించబడుతున్నాడు. ఇతర దేవీదేవతల కంటే ముందు ఈ గణపతి దేవుడినే పూజించడం విశేషం. ఈ వినాయక చవితిని గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి, గణేష్ ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. వినాయకుని పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ పండుగను అత్యంత వైభవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా, రాష్ట్రాల్లో జరుపుకుంటారు. అయితే ఈ పండుగ ఎప్పుడు వచ్చింది? పూజ ముహూర్తం ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ రోజున చేయాల్సిన విధి విధానాల ఏంటి అనే వివరాలు మీ కోసం. 

వినాయక చవితి పండుగ తేదీ: 

హిందూ పండుగలనేవి తిథుల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రతి ఏటా ఈ తేదీలు మారుతుంటాయి. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ వల్ల ప్రతి ఏటా పండుగ తేదీ ఎప్పుడనే విషయంలో గందరగోళం నెలకొంటూ ఉంటుంది. ఆగస్టులో వస్తుందా? సెప్టెంబర్ లో వస్తుందా అనే సందేహం చాలా మందికి ఉంది. అయితే ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 6న ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకూ కొనసాగుతుంది.

వినాయక చవితి శుభ ముహూర్తం, తిథి:

పంచాంగం ప్రకారం వినాయక చవితి రోజున గణపతి దేవుడ్ని ఆహ్వానించడానికి శుభప్రదమైన సమయం సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3.01 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 7న సాయంత్రం 5.37 గంటలకు ముగియనుంది. ఇక పూజ చేసేందుకు శుభ ముహూర్తం సెప్టెంబర్ 7న ఉదయం 11.03 నుంచి 1.34 మధ్యలో ఉంది.          

వినాయక చవితి విధి విధానాలు, వేడుక:

భక్తులు తమ ఇళ్లను పువ్వులతో, మామిడి ఆకులతో అలంకరించాలి. అనంతరం మట్టి గణపతిని ఇంట్లోకి ఆహ్వానించాలి. మట్టి గణపతిని అలంకరించాలి. అందంగా అలంకరించిన మట్టి గణపతిని పూజ మందిరంలో ఏర్పాటు చేసిన పాళీలో పెట్టాలి. కార్యాలయాల్లో, విద్యాసంస్థలు వంటి చోట్ల వినాయక చవితి రోజున గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటే మంచిది. ఇక వినాయక చవితి రోజున చేయాల్సిన వాటిలో ప్రధానంగా నాలుగు విధి విధానాలు ఉన్నాయి. ప్రాణ ప్రతిష్ట, షోడోపచార, ఉత్తర పూజ, విసర్జన పూజ అనే నాలుగు విధి విధానాలు ఉన్నాయి. మంత్రాలు జపిస్తూ పూజారి ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ఆ తర్వాత షోడోపచార పూజలో భాగంగా 16 రకాల పూజా విధానాలు ఉన్నాయి. ఈ పూజల్లో భాగంగా గణపతికి ఇష్టమైన లడ్డూ, కుడుములు, ఉండ్రాళ్ళు వంటివి ప్రసాదంగా సమర్పిస్తారు. ఇక మూడవది ఉత్తర పూజ. ఈ పూజలో భాగంగా గణపతి లడ్డూ వేలం వేసి వీడ్కోలు పలుకుతారు.  పదో రోజు లేదా ఆఖరి రోజున సమీప నదిలో భక్తితో వినాయక నిమజ్జనం చేస్తారు. గణేష్ విసర్జన్, గణేష్ నిమజ్జనం అని అంటారు. ‘గణపతి బప్పా మోరియా, పుర్చ్య వర్షి లౌకరియా’ అంటూ జపిస్తూ నిమజ్జనం చేస్తారు. వీడ్కోలు గణేశా.. వచ్చే ఏడాది మళ్ళీ రండి అని జపిస్తూ నిమజ్జనం చేస్తారు.   

Show comments