MP Govt-Gas Cylinder Per Rs 450: రాఖీ పండుగ ఆఫర్‌.. రూ.450కే గ్యాస్‌ సిలిండర్‌.. ఎక్కడంటే!

Gas Cylinder: రాఖీ పండుగ ఆఫర్‌.. రూ.450కే గ్యాస్‌ సిలిండర్‌.. ఎక్కడంటే!

MP Govt-Gas Cylinder Per Rs 450: రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.450లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

MP Govt-Gas Cylinder Per Rs 450: రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.450లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

పండగలు వస్తున్నాయంటే చాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు ఏదో ఒక శుభవార్త చెబుతాయి. గతేడాది రక్షా బంధన్‌, ఈ ఏడాది శివరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధరలను రెండు సార్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో గృహ అవసరాలకు వాడే గ్యాస్‌ సిలిండర్‌ ధర 800 రూపాయల చిల్లర ఉంది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగినా.. డొమెస్టిక్‌ సిలిండర్‌ రేటు మాత్రం స్థిరంగానే ఉంటుంది. ఇక త్వరలోనే రక్షా బంధన్‌ రానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. వారికి 450 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాలు..

రక్షాబంధన్ పండుగ దగ్గర పడుతోంది. గతేడాది రాఖీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాదికి సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాడ్లీ బహనా యోజన కింద 450 రూపాయలకు ఎల్‌పీజీ సిలిండర్లను అందించనున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్న 40 లక్షల మంది లాడ్లీ బహన్‌లకు, నాన్‌పీఎంయూవై లబ్ధిదారులకు రూ. 450లకే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ ప్రకటించారు. దీనిపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

గత సంవత్సరం, రక్షాబంధన్ సందర్భంగా, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్‌పీజీ వినియోగదారులందరికీ (33 కోట్ల కనెక్షన్లు) పెద్ద బహుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. రాఖీ పండుగ కానుకగా.. ఒక్కో సిలిండర్‌పై రూ.200 తగ్గించింది. ఆ తర్వాత మరోసారి అనగా..  మార్చి 8, 2024న, మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది.

అదే సమయంలో ఉజ్వల యోజన లబ్ధిదారులకు 300 రూపాయల సబ్సిడీ లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో పథకం లబ్ధిదారులు ఇప్పుడు 500 రూపాయలకు సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు స్థిరంగా ఉండగా.. వాణిజ్య సిలిండర్‌ ధరల్లో మాత్రం మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి నెల ప్రారంభంలో ఆయిల్‌ కంపెనీలు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచడం, తగ్గించడం వంటి నిర్ణయం తీసుకుంటాయి.

Show comments