Vinay Kola
APY: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. వాటిలో డబ్బులు పెట్టుబడి పెట్టడం ద్వారా చాలా లాభాలను పొందవచ్చు.
APY: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. వాటిలో డబ్బులు పెట్టుబడి పెట్టడం ద్వారా చాలా లాభాలను పొందవచ్చు.
Vinay Kola
మధ్య తరగతి ప్రేక్షకులకు ఎంత ఖర్చు ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయినా కానీ తమ సంపాదన నుండి కొంత డబ్బుని ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు. వారి డబ్బుని సేఫ్ గా ఉండే స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. మనకు మంచి లాభాలనిచ్చే మంచి మంచి స్కీమ్స్ చాలానే ఉన్నాయి. ఇది కాకుండా, కొంతమంది తమ వృద్ధాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరైన పెట్టుబడి మార్గం కోసం చూస్తూ ఉంటారు. వృద్ధాప్యం వచ్చాక ప్రతి నెలా ఒకేసారి డబ్బు లేదా పెన్షన్ పొందే స్కీమ్ కోసం చూస్తారు. ఇప్పుడు చెప్పే స్కీమ్ పేదవారికి, ఇంకా ఎవరైతే పదవి విరమణ తరువాత పెన్షన్ రాని జాబులు చేస్తున్నారో వారికి బాగా యూజ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ని రన్ చేస్తుంది. దీనిలో ఇప్పటికే 7 కోట్ల మంది తమ డబ్బుని ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందుతున్నారు. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అటల్ పెన్షన్ యోజన స్కీమ్.. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా, వృద్ధాప్యాన్ని ప్రశాంతంగా గడిపేలా చేస్తుంది. పైగా ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కావడంతో పెన్షన్‌కు హామీ ఉంటుంది. మీరు ప్రతి నెలా కొంచెం డబ్బుని డిపాజిట్ చేస్తే చాలు మీ వృద్ధాప్యాన్ని ఆర్థికంగా ప్రశాంతంగా గడపవచ్చు. ఇందులో మనం పెట్టె పెట్టుబడి కనీసం మనం ప్రతిరోజూ తాగే ఒక కప్పు టీ ధర అంతా కూడా ఉండదు. అంత తక్కువ పెట్టుబడితోనే ప్రతి నెలా రూ. 5000 పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్ లో రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎవరైనా కూడా ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ స్కీమ్ కింద మీరు పింఛను పొందాలంటే కనీసం 20 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాలి. అంటే, మీరు 40 ఏళ్ల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీకు 60 ఏళ్లు వచ్చిన వెంటనే మీకు పెన్షన్ వస్తుంది.
ఇక మీ వయస్సు 18 సంవత్సరాలు లేదా ఆపై ఉంటే ప్రతి నెలా 210 రూపాయలు డిపాజిట్ చేస్తే పెన్షన్ పొందవచ్చు. అంటే రోజుకు కేవలం 7 రూపాయలు కడితే చాలు. మీరు 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెలా 5000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. అంటే జస్ట్ రోజుకి మనం టీ తగినంత ఖర్చు కూడా ఉండదు మన పెట్టుబడి. లేదు మీకు నెలకు 210 రూపాయలు కూడా కట్టడం కష్టమైతే ప్రతి నెలా 42 రూపాయలు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే 42 రూపాయల పెట్టుబడికి 1000 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుంది. కానీ నెలకి 210 రూపాయలు ఇన్వెస్ట్ మెంట్ అయితే చాలా తక్కువనే చెప్పాలి. మీరు చాలా ఈజీగా కట్టవచ్చు. ఇందులో భార్యాభర్తలిద్దరూ డబ్బులు కడితే ఇద్దరి మీద నెలకు 10 వేల రూపాయల పెన్షన్ పొందవచ్చు. ఇక 60 ఏళ్లలోపు భర్త చనిపోతే భార్యకు తన భర్త పింఛన్ డబ్బులు కూడా వస్తాయి. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ మరణించినప్పుడు, నామినీకి మొత్తం డబ్బు వస్తుంది. పైగా ఇందులో మీరు రూ.1.5 లక్షల దాకా ట్యాక్స్ ని సేవ్ చేసుకోవచ్చు. ఇక ఈ స్కీమ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.