రతికా రోజ్- రాహుల్ సిప్లిగంజ్ రిలేషన్ గురించి మీకు తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆట ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ అసలు ఆటను మొదలు పెడుతున్నారు. మొదటి రెండ్రోజులు కాస్త మొహమాటం ప్రదర్శించినా.. ఇప్పుడు కుల్లానే మాట్లాడేస్తున్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, ఎదుటి వారిపై ఫైర్ అవడం చూస్తున్నాం. నిజానికి ప్రతి సీజన్ లో ఇలాంటి ప్రవర్తన రెండో వారంలో మొదలవుతుంది. ఇప్పుడు రెండ్రోజులకే స్టార్ట్ చేశారు. చిన్నగా గ్రూపులు కూడా ఫామవుతున్నాయి. ఇంక కంటెస్టెంట్స్ ఆట చూస్తే.. అందరూ కాస్త సేఫ్ గేమ్ ఆడుతున్నట్లే కనిపిస్తోంది.

ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో రతికా రోజ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందరూ ఆమె అందం, ఆటతీరు చూసి ముచ్చటపడిపోతున్నారు. సినిమా హీరోయిన్ అయినా కూడా ఎంతో సింపుల్ గా ఉంటోందని చెబుతున్నారు. పైగా ఆమె తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోతున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. రతికా రోజ్ ఏడేళ్ల క్రితమే బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. అప్పట్లో ప్రియా పేరుతో పటాస్ కామెడీ షోలో పంచు డైలాగులతో ప్రేక్షకులను తెగ నవ్వించేసింది. తర్వాత హీరోయిన్ కూడా అయిపోయింది. అయితే చాలామందికి రతిక పటాస్ చేసిందని తెలియదు.

ఇది కూడా చదవండి: ఈ సీజన్ లో ఎవరి రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే?

ఇది కూడా చదవండి: ఒక్క టాస్కు విన్ అయితే.. 5 వారాలు హౌస్ లోనే!

ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత రతికాకి సంబంధించిన అన్ని విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఒక ప్రశ్న బాగా వినిపిస్తోంది. రతిక- రాహుల్ సిప్లిగంజ్ రిలేషన్ ఏంటో తెలుసా? అంటూ క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఇందుకు చాలా మంది వాళ్లు ఇద్దరు కొంపదీసి ప్రేమికులా? ఏంటి అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇంకొందరు ఇంకో అడుగు ముందుకేసి.. వాళ్లు భగ్న ప్రేమికులు అంటూ చెబుతున్నారు. వాళ్లిద్దరికి బ్రేకప్ జరిగింది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే అప్పుడే ఆ కంక్లూజన్ కు వచ్చేయకండి. నిజానికి రాహుల్ సిప్లిగంజ్- రతికలకు రిలేషన్ ఉంది.

ఆ రిలేషన్ ఏంటంటే.. రాహుల్ చేసిన హేయ్ పిల్లా అనే మ్యూజిక్ వీడియోలో రతిక లీడ్ రోల్ ప్లే చేసింది. రాహుల్ కలిసి ఆ సాంగ్ లో నటించింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చినట్లు ఉన్నాయి. అవి చూసిన వాళ్లు ఎవరికి నచ్చింది వాళ్లు అనేసుకుంటున్నారు. ఈ వీడియో సాంగ్ ని 2019 జనవరి 3న రాహుల్ సిప్లిగంజ్ తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేశాడు. ఆ పాటకు 1.4 మిలియన్ కి పైగా వ్యూస్ కూడా వచ్చాయి. సో దీన్ని బట్టి చూస్తే.. రతికా రోజ్- రాహుల్ సిప్లిగంజ్ మధ్య కేవలం ప్రొఫెషెనల్ రిలేషన్ మాత్రమే ఉందని చెప్పచ్చు. మరి.. ఈ రూమర్స్ మీద రాహుల్ సిప్లిగంజ్ ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి.

Show comments