అన్నవరం రైల్వే స్టేషన్‌లో గంటన్నర హైడ్రామా.. అసలు ఏం జరిగిందంటే?

Annavaram Railway Station: తెలుగు రాష్ట్రాలో ఎన్నో ప్రసిద్దమైన పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. వాటిలో ఒకటి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి. ఇక్కడి ఎక్కువగా భక్తులు వివాహలు, సత్యనారాయణ వ్రతాలు జరిపిస్తుంటారు.

Annavaram Railway Station: తెలుగు రాష్ట్రాలో ఎన్నో ప్రసిద్దమైన పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. వాటిలో ఒకటి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి. ఇక్కడి ఎక్కువగా భక్తులు వివాహలు, సత్యనారాయణ వ్రతాలు జరిపిస్తుంటారు.

భారత దేశంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి చాలా ప్రసిద్దమైనదన్న విషయం తెలిసిందే.ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అన్నవరంలో రత్నగిరి కొండ మీద ఉంది.అన్నవరం సత్యదేవుడి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో నిత్యం సత్యనారాయణ వ్రతాలు, వివాహాలు జరుగుతుంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి సత్యదేవుడి దర్శనానికి భక్తులు తరలి వస్తుంటారు. అన్నవరం సత్యదేవుడి దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి సొంతూరు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కి వచ్చారు. అక్కడ కొద్దిసేపు హైడ్రామా చోటు చేసుకుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

అన్నవరంలో సత్యదేవుడి దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి తమ సొంత ఊరు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కి వచ్చారు. విజయవాడకు చెందిన ఏడుగురు భక్తులు స్వామి వారి దర్శనం అనంతరం తిరిగి ప్రయాణమయ్యారు. రైలు ఎక్కేందుకు మూడో నంబర్ ఫ్లాట్ ఫాం నుంచి లిఫ్ట్ లో పై వంతెనకు వెళ్లున్న సమయంలో లిఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంలో అందులో ప్రయాణికులు ఇరుక్కపోయారు. అంతే ఒక్కసారిగా భక్తులు భయంతో వణికిపోయారు..లిఫ్ట్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో రక్షించమంటూ కేకలు వేశారు. సుమారు గంటన్నర పాటు ప్రయాణికులు లిఫ్ట్ లో ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే అధికారలు వెంటనే అక్కడికి వచ్చారు. జీఆర్పీ, రైల్వే విద్యుత్ విభాగం అధికారులు లిఫ్ట్ పై భాగంలో ఉన్న రంధ్రం తెరిచి, నిచ్చెన వేసి ప్రయాణికులను బయటకు తీశారు.

సుమారు గంటన్నర పాటు ప్రయాణికులు లిఫ్ట్ లోనే ఇరుక్కు పోవడంతో నరకం చూశారు. మొత్తానికి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం గురించి రైల్వే అధికారులు మాట్లాడుతూ.. లిఫ్ట్ లో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగింది.. కొద్ది సేపు మాత్రమే లిఫ్ల్ ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా రక్షించామని తెలిపారు. ఇదిలా ఉంటే తరుచూ విద్యుత్ అంతరాయం, నిర్వహణ లోపం, సాంకేతిక సమస్యల వల్ల లిఫ్టులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show comments