Arjun Suravaram
APS RTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణికులకి, ఇతరులకు తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతూనే ఉంటుంది. తాజాగా జర్నలిస్టులకు కూడా ఓ శుభవార్తను ఆర్టీసీ చెప్పింది. మరి.. అది ఏమిటంటే..
APS RTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణికులకి, ఇతరులకు తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతూనే ఉంటుంది. తాజాగా జర్నలిస్టులకు కూడా ఓ శుభవార్తను ఆర్టీసీ చెప్పింది. మరి.. అది ఏమిటంటే..
Arjun Suravaram
ప్రభుత్వ రవాణ వ్యవస్థల్లో ప్రధానమైనది ఆర్టీసీ వ్యవస్థ. ఇది దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉంది. అలానే ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రజలకు రవాణ సేవలు అందిస్తుంది. ఇలా ఏపీఎస్ ఆర్టీసీ వివిధ వర్గాల వారికీ.. రాయితీలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులకు, యువతకు, మహిళకు, సినీయర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. అలానే జర్నలిస్టులకు కూడా అనేక రకాల సదుపాయాలను ఆర్టీసీ కల్పిస్తుంది. తాజాగా జర్నలిస్టులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మరి.. ఆ గుడ్ న్యూస్ ఏమిటో ఆవివరాలు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇచ్చిన రాయితీ బస్ పాసుల గడవును పెంచింది. గతంలో ఉన్న గడువును పెంచుతూ ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టులకు ఇచ్చిన రాయితీ బగస్ పాసుల గడవును 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. మాములుగా వారి బస్ పాస్ గడువు రేపటితో ముగియనుంది. దీంతో గడువు తేదీని పెంచాలని జర్నలిస్టులు కోరినట్లు సమాచారం. దీంతో రాయితీ బస్ పాసుల వ్యాలిడిటీని పెంచాలని రాష్ట్ర సమాచార శాఖ ఏపీఎస్ ఆర్టీసీని కోరింది. దీంతో బస్ రెన్యువల్ చేయాలని అన్ని జిల్లాల్లో అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక ఏపీఎస్ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలుపుతూ కొందరు జర్నలిస్టులు సోషల్ మీడియాలో ట్విట్ పోస్టు చేశారు. ఇక ఏపీఎస్ ఆర్టీసీనే కాకుండా ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకు అనేక సదుపాయాలు కల్పిస్తుంటాయి. జర్నలిస్టులంటే ప్రభుత్వాల దృష్టి లో విలువ లేని వారిలా మిగిలి పోతున్నారనే ఆవేదన గతంలో ఉండేది. కానీ వారికి కొన్ని హక్కులుంటాయని, సమయంతో పాటే పరిగెత్తే శ్రామికుడే జర్నలిస్టు అని ప్రభుత్వాలు గుర్తిస్తుంటాయి. దీంతో వారికి ప్రభుత్వాలు ఏదో చిన్న చిన్న పధకాలతో జర్నలిస్టులను సంబర పరుస్తుంటాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం జర్నలిస్టులకు అనేక సదుపాయాలను కల్పిస్తుంది.
ఇక ఏపీఎస్ ఆర్టీసీ విషయానికి వస్తే.. రాష్ట్రంలోని ప్రధాన సంస్థలో ఇది ఒకటి. దీని ద్వారా నిత్యం వేలాది మంది వారి గమ్యస్థానాలకు చేరుతుంటారు. అంతేకాక ప్రయాణికులకు అనేక సదుపాయాలను కల్పిస్తూ ఆకట్టుకుంటుంది. తరచూ పండగలకు, ఇతర సందర్భాల్లో ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తూ ఉంటుంది. విద్యార్థులకు సైతం, పరీక్ష సందర్భంలో శుభవార్తలు చెబుతుంటాయి. ఇటీవలే పక్క రాష్ట్రం తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అక్కడి ఆర్టీసీ కల్పించింది. మరి.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టుల విషయంలో ఏపీఎస్ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.