Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దిపై దుష్ప్రచారం.. అసలు నిజాలతో వీడియో వైరల్!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీడీపీ, ఇండస్ట్రియల్‌ గ్రోత్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పర్‌క్యాపిటాల ర్యాంకుల్లో ఏ స్థానంలో ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాల్లో నిజం ఎంత?..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీడీపీ, ఇండస్ట్రియల్‌ గ్రోత్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పర్‌క్యాపిటాల ర్యాంకుల్లో ఏ స్థానంలో ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాల్లో నిజం ఎంత?..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. నవరత్నాల పేరిట రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలను అందిస్తోంది. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు అన్ని వర్గాల వారి కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినప్పటికి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షానికి చెందిన మీడియా, సోషల్‌ మీడియాల్లో ఈ ప్రచారం జోరందుకుంది.

టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దిపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది.  అభివృద్ధి, ఇతర విషయాలకు సూచికలుగా చెప్పుకునే.. జీడీపీ, ఇండస్ట్రియల్‌ గ్రోత్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పర్‌క్యాపిటా విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలాంటి స్థానంలో ఉందన్న లెక్కలు వెల్లడయ్యాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాలుగున్నర ఏళ్లలో.. ఇంతకీ జీడీపీ రేటు పెరిగిందా? తగ్గిందా?..

ఇండస్ట్రియల్‌ గ్రోత్‌ రేట్‌ ఎంత? ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ ర్యాంకు ఎంత? పర్‌క్యాపిటాలో ఏపీ ర్యాంకు ఎంత?… ఆర్బీఐ లెక్కల ప్రకారం గత ప్రభుత్వంతో పోలిస్తే.. ఆంధ్రరాష్ట్రం జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌ విషయంలో 16 స్థానంనుంచి అమాంతం 4వ స్థానానికి ఎగబాకింది. ఇండస్ట్రియల్‌ గ్రోత్‌ రేటులో మూడింతలు పెరిగి మూడో స్థానంలో నిలిచింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ స్థానంలో నిలిచింది. పర్‌క్యాపిటాకు సంబంధించి టాప్‌ 10లో నిలిచింది.

అగ్రికల్చర్‌ సెక్టార్‌లో 16 స్థానం నుంచి నాలుగవ స్ధానానికి చేరింది. ఎడ్యుకేషన్‌ విషయంలో 17 నుంచి మూడవ స్థానానికి చేరింది. ఇంగ్లీష్‌ మీడియంలో ఫస్ట్‌ ర్యాంక్‌, మెరైన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్‌ ర్యాంకు.. ఫుడ్‌ ప్రొడక్షన్‌లో ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకుంది. ఇలా అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఏపీలోనే ముందంజలో ఉంది. అంతేకాదు! సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విషయంలోనూ ఏపీ ప్రభుత్వం దేశంలో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పూర్తిగా నిలుస్తోంది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా, మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ ఉచిత వైద్యానికి సంబంధించి ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని పెంచింది. పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలు చేసింది. ఇప్పటికే క్యాన్సర్‌ లాంటి పెద్ద రోగాలకు సైతం పరిమితి లేని చికిత్సలు అందిస్తోంది. వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు ఉన్న ప్రతీ కుటుంబాన్ని ఆరోగ్య శ్రీలోకి చేర్చడం వల్ల 90 శాతం కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. మరి, అన్ని రంగాల్లో ఏపీ ప్రభుత్వం అభివృద్ధి సాధించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments