iDreamPost

అమెరికాలో స్ట్రీట్ ఫైట్ లో తెలుగు విద్యార్థులు.. వైరల్ అవుతున్న వీడియో!

అమెరికాలో స్ట్రీట్ ఫైట్ లో తెలుగు విద్యార్థులు.. వైరల్ అవుతున్న వీడియో!

అమెరికాలో స్ట్రీట్ ఫైట్లు, నడిరోడ్డుపై ఘర్షణలు సర్వ సాధారణం. అలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. అవి చూసిన ఇండియన్స్, తెలుగు వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వీడియో కూడా అలాంటిదే కానీ, దీనిని చూసి మీరు ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే ఈ వీడియోలో కొట్టుకుంది ఇండియన్స్ అందులోనూ.. తెలుగువాళ్లు. చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు ఇలా వీధి రౌడీల్లా కొట్టుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఘర్షణ నాపర్ విల్లీలో జరిగిందిగా చెబుతున్నారు. జామర్స్ లైవ్ బ్యాండ్ ఈవెంట్ తర్వాత నిర్వాహకులకు, అక్కడికి వచ్చిన ఎమ్మెస్ స్టూడెంట్స్ కి మధ్య జరిగింది. గొడవ ఎవరి వల్ల ప్రారంభం అయిందో తెలీదు గానీ.. ఒకరికిని ఒకరు తిట్టుకుంటూ రోడ్డుపై కొట్టేసుకున్నారు. ఒకళ్లకి అయితే ఒంటిపై చొక్కా కూడా ఊడిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ గొడవకు సంబంధించి కొన్ని పుకార్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ గొడవ డల్లాస్ పుంలో జరిగిందని.. అక్కడ జరుగుతున్న నాటా కన్వెన్షన్ సమీపంలో జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు.

అయితే ఈ గొడవ అక్కడ జరిగింది కాదని.. అదంతా తప్పుడు ప్రచారం అంటూ తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు దీనికి కారకులు అనే విషయాలను కాసేపు పక్కన పెట్టండి. చదువుకోవడానికి వేరే దేశం వెళ్లి ఇలా రోడ్లపై కొట్టుకోవడం మాత్రం అస్సలు ఏం బాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తల్లిందడ్రులు కష్టపడి మిమ్మల్ని విదేశాలకు పంపింది ఇందుకేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి