iDreamPost

వీడియో: ఉచిత ప్రయాణం పథకం వద్దు రేవంత్ అన్నా అంటోన్న మహిళలు

తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరింది. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని అమలు చేసే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరింది. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని అమలు చేసే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది.

వీడియో: ఉచిత ప్రయాణం పథకం వద్దు రేవంత్ అన్నా అంటోన్న మహిళలు

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే పనిలో పడింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే రెండు హామీలపై సంతకాలు చేశారు. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ స్కీంలో భాగంగా మహిళలు, యువతులు, ట్రాన్స్ జెండర్లు, విద్యార్థినులకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని అందించింది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్రంలో ఉన్నట్లు నిర్దారించే ఏదైనా గుర్తింపు కార్డుతో తెలంగాణ వ్యాప్తంగా అర్హులు ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలు చేసిన నాటి నుండి విశేష స్పందన వస్తుంది. పల్లె, పట్నం అని తేడా లేకుండా బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.

అంతేకాకుండా సరిపడా బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. గంటలు గంటలు బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తుంది. వచ్చిన ఒక్క బస్సు కూడా కొంత మందిని ఎక్కించుకోవడంతో ఫుల్ అయిపోయి.. మరికొంత మందిని.. ఆపి.. వెనుక బస్సుకు రావాలంటూ కోరుతున్నారు. దీంతో రెగ్యులర్ ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలకు, పనులు, కాలేజీలకు వెళ్లే మహిళలు, యువతులు, విద్యార్థినులు గగ్గోలు పెడుతున్నారు. బస్సులు కిక్కిరిసి పోవడంతో కాలేజీ అబ్బాయిలు కూడా వాహనానికి వేలాడే పరిస్థితి. ప్రమాదం అంచున విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. మహిళలు సైతం మెట్లపై వేలాడుతూ వెళుతున్నారు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు ప్రయాణిస్తున్న సమయం రెండింతలు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పథకం వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. కొంత మంది ఈ పథకం మాకు వద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ‘రేవంత్ అన్నా.. దయచేసి మాకు ఈ మహాలక్ష్మి పథకం వద్దు. తీసేసేయ్. ఆడవాళ్లకు హెల్ప్ చేయ్ కానీ ఈ పిచ్చి పిచ్చి పథకాలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. దీని వల్ల కాలేజీ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేం బస్సు డోర్ వద్ద రోజు అప్ అండ్ డౌన్ ప్రయాణిస్తున్నాం. ఏ పథకాలైనా విద్యార్థులకు పెట్టండి. అలాగే మాకు నిత్యావసర సరుకు ధరలు తగ్గించండి. ఈ పథకం మాకు వద్దు’ అంటూ మొరపెట్టుకుంటున్నారు. మరీ ఆ వీడియో చూసి.. మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Political Pracharam (@politicalpracharam)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి