iDreamPost

మేడారం వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌! ఈ రూట్స్‌లో స్పెషల్‌ బస్సులు.. మహిళలకు ఫ్రీ!

మరికొన్ని రోజుల్లో మేడారం జాతర ప్రారంభమవనుండగా ఇప్పటి నుంచే భక్తులు జాతరకు పోటెత్తుతున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది.

మరికొన్ని రోజుల్లో మేడారం జాతర ప్రారంభమవనుండగా ఇప్పటి నుంచే భక్తులు జాతరకు పోటెత్తుతున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది.

మేడారం వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌! ఈ రూట్స్‌లో స్పెషల్‌ బస్సులు.. మహిళలకు ఫ్రీ!

తెలంగాణలో మేడారం జాతర సందడి షురువైంది. భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న సమ్మక్క, సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు మేడారానికి పయనమవుతున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు వనదేవతలను దర్శంచుకునేందుకు భక్తులు తండోపతండాలుగా మేడారానికి తరలివస్తారు. ఆపదలను తీర్చే ఆపద్భాందవులుగా భక్తుల నుంచి వనదేవతలుగా పూజలందుకుంటున్నారు సమ్మక్క సారక్కలు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది మేడారం జాతరకు తరలి వస్తారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగనున్నది. అడవి తల్లులను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని వనదేవతలపై భక్తులకు ఎంతో విశ్వాసం. మేడారంలో ప్రత్యేకమైన గుడి అంటూ ఏమీ లేదు. ఇక ఈ ఏడాది జరిగే జాతరకు భక్తులు ఇప్పటి నుంచే తరలి వెళ్తున్నారు. ప్రకృతి తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరి మేడారానికి మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ రూట్స్ లో ప్రత్యేకమైన బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. అదే విధంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. మేడారం వెళ్లే మహిళలకు ఫ్రీ జర్నీ కల్పించనున్నట్లు తెలుస్తోంది.

మేడారం జాతరకు తరలి వెళ్లే భక్తులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ ఈసారి 6 వేల బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి 25వరకు బస్సులను నడపాలని ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. కాగా ఉమ్మడి ఖమ్మం డిపోల నుంచి 400ల ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. సత్తుపల్లి డిపో నుంచి వెంకటాపురం, ఏటూరునాగారం, చర్ల పరిధిలో 24 బస్సులు , మణుగూరు డిపో నుంచి మణుగూరు, మంగపేట, 20 బస్సులు, కొత్తగూడెం డిపో నుంచి కొత్తగూడెం, టేకులపల్లి నుంచి 155 బస్సులు, మధిర డిపో నుంచి పాల్వంచ, మదిర 35 బస్సులు, ఖమ్మం డిపో నుంచి ఖమ్మం, 128 బస్సులు, భద్రాచలం డిపో నుంచి 38 బస్సులు మేడారంకు సర్వీస్‌లు నడవనున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మేడారం జాతరకు ఏయే ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతారు.. ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి అనే విషయాలు రవాణా శాఖ మంత్రి త్వరలోనే వెల్లడించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి