iDreamPost

మందు బాబులకు బిగ్ అలెర్ట్! అలా చేస్తే.. 6 నెలలు జైలుకే!

మందు బాబులకు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. ఇక నుంచి అలా చేస్తే.. 6 నెలల జైలు శిక్ష విధిస్తామని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తూ.. ఓ పోస్ట్ ను షేర్ చేశారు.

మందు బాబులకు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. ఇక నుంచి అలా చేస్తే.. 6 నెలల జైలు శిక్ష విధిస్తామని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తూ.. ఓ పోస్ట్ ను షేర్ చేశారు.

మందు బాబులకు బిగ్ అలెర్ట్! అలా చేస్తే.. 6 నెలలు జైలుకే!

సాధారణంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే మటన్ ముక్కా.. మందు చుక్కా ఉండాల్సిందే. ఇది అనాదిగా వస్తున్నదే. అయితే మేము ఎలా పడితే.. అలా తాగుతాం అంటే కుదరదు అంటూ మందు బాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. ఇక నుంచి అలా మద్యం సేవిస్తే.. 6 నెలల జైలు శిక్ష తప్పదు అంటూ ట్విట్టర్ వేదికగా  ఓ పోస్ట్ ను షేర్ చేసింది. దాంతో మందు బాబులు అలెర్ట్ కావాల్సిన సమయం వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

మందు బాబులకు బిగ్ అలెర్ట్.. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ.. పోలీసులకు చిక్కారో ఇక మీ సంగతి అంతే. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరిత్య నేరం.. ఇందుకు 6 నెలల జైలు శిక్ష విధిస్తామని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. “బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల ప్రజలకు, స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అదీకాక బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరం. రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో మందు తాగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ నేరానికి 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది” అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇలాంటి ఘటనలపై 100కు డయల్ చేయాలని సూచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి