iDreamPost

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరికి ఏ శాఖ అంటే..

  • Published Dec 09, 2023 | 10:16 AMUpdated Dec 09, 2023 | 10:16 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 7న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 7న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

  • Published Dec 09, 2023 | 10:16 AMUpdated Dec 09, 2023 | 10:16 AM
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరికి ఏ శాఖ అంటే..

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ ఒడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించిన నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాకపోతు అధిష్టానం నుంచి శాఖలు మాత్రం కేటాయించలేదు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మంత్రుల శాఖ కేటాయింపు పై అధినేతలతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు మంత్రులకు శాఖల కేటాయింపు ఇవ్వడం జరిగింది. మరోవైపు తెలంగాణ మూడో శాసన సభ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. వివరాల్లోకి వెళితే..

శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తో తెలంగాణ శాసన సభ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. అల్లా సాక్షిగా అక్బరుద్దీన్ అను నేను నా బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అలాగే మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ శావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్టికల్ 178 ప్రకారం శాసన సభ కొత్త స్పీకర్ ని ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ బాధ్యతలు నిర్వహిస్తారని గవర్నర్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశంలో నూతన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తెలంగాణ నూతన మంత్రులకు కేటాయించిన శాఖల విషయానికి వస్తే..

  • మల్లు భట్టి విక్రమార్క – ఆర్ధిక వ్యవహారాలు, విద్యుత్ శాఖ
  • దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు – ఐటీ, పరిశ్రమల శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు
  • ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి – సివిల్ సప్లై మరియు నీటిపారుదల శాఖ
  • దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ
  • కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – రోడ్లు భవనాల శాఖ
  • పొన్నం ప్రభాకర్‌ – రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమం
  • సీతక్క – పంచాయతీరాజ్‌ శాఖ మరియు మహిళా శిశి సంక్షేమం
  • తుమ్మల నాగేశ్వరరావు – చేనేత శాఖ, వ్యవసాయ శాఖ
  • కొండా సురేఖ – అటవీ శాఖ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ
  • జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్‌, పర్యాటక శాఖ
  • పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – సమాచార శాఖ, రెవెన్యూ, గృహనిర్మాణం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి